వారికి ఇద్దరు పిల్లలు.. సడన్‌గా భర్త లింగమార్పిడి.. తర్వాత యువకుడితో ఆమె చేసిన సహజీవనం.. అంతవరకు వెళ్తుందని ఊహించలేదు..

Dec 7 2021 @ 17:14PM
ప్రతీకాత్మక చిత్రం

సంసారం సాఫీగా సాగే క్రమంలో కొందరికి వైరాగ్యం పుట్టుకొస్తుంటుంది. దీంతో భార్యా, పిల్లలను వదిలేసి.. సన్యాసులుగా మారడం కూడా చూస్తుంటాం. అలాగే ఇంకొన్ని సందర్భాల్లో భార్యలు కూడా ఇలాగే చేస్తుంటారు. పశ్చిమగోదావరి జిల్లాలో కూడా దాదాపు ఇలాగే జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్న భార్యాభర్తలు సంతోషంగా సంసారం చేస్తున్నారు. అయితే ఏమైందో ఏమో గానీ.. భర్త సడన్‌గా లింగమార్పిడి చేయించుకున్నాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయం ఎంతవరకు వెళ్లిందంటే..

పశ్చిమగోదావరి పరిధిలోని ఏలూరు బీడీ కాలనీకి చెందిన సుధారాణికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త రికార్డింగ్ డాన్సులు నిర్వహిస్తూ.. కుటుంబాన్ని పోషిస్తుంటాడు. సంసారం సాఫీగా సాగిపోతున్న క్రమంలో భర్తకు ఏమైందో ఏమోగానీ .. ఓ రోజు సడన్‌గా లింగమార్పిడి చేయించున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లిన భర్తను చూసి.. ఆమె షాక్‌ అయింది. ఉన్నట్టుండి భర్త ఇలా చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. అనంతరం ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

భర్తతో సుఖం దొరకలేదని.. పరాయి మగవారిపై మనసు పడింది.. ఓ రోజు చెత్త ఏరుకునే వ్యక్తి ఇంట్లోకి రాగానే..

ఆందోళనలో ఉన్న ఆమెకు స్థానిక ప్రాంతానికి చెందిన డింపుల్ కుమార్ అనే యువకుడు పరిమయమయ్యాడు. ఆమెకు ఓదార్పు లభించడంతో అతడికి బాగా దగ్గరైంది. ఇలా ఆ యువకుడితో సహజీవనం చేసింది. ఈ క్రమంలో వారికి ఓ పాప కూడా పుట్టింది. తదనంతర క్రమంలో భార్యాభర్తలు చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. రోజూ మద్యం తీసుకుంటూ ఆరోగ్యం పాడు చేసుకునేవారు. ఓ రోజు ఫుల్‌గా తాగి వస్తుండడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుధారాణి అక్కడికక్కడే మృతి చెందింది. డింపుల్ కుమార్ మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు.. డింపుల్ ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే భయంతో ఉన్న డింపుల్... ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు దర్యాప్తులో ఉంది.

ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్లిన మహిళ.. పనుందని పక్కకు తీసుకెళ్లిన ఎస్ఐ.. ఆమె బలహీనతను గమనించి..

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.