పెళ్లయిన కొన్ని నెలలకే భర్త ప్రవర్తనలో మార్పు.. చివరికి విషయం తెలుసుకుని భార్య ఏం చేసిందంటే..

Published: Wed, 19 Jan 2022 17:39:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పెళ్లయిన కొన్ని నెలలకే భర్త ప్రవర్తనలో మార్పు.. చివరికి విషయం తెలుసుకుని భార్య ఏం చేసిందంటే..

వివాహమైన కొత్తలో ఉన్న ప్రేమాభిమానాలను కొందరు దంపతులు జీవితాంతం కొనసాగిస్తారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఒకరికొకరు మాట్లాడుకుని సరిదిద్దుకుంటారు. ఇంకొందరి వివాహ బంధాలు మధ్యలోనే ముగిసిపోతుంటాయి. చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని చివరకు విడాకుల వరకు తెచ్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల్లో ఎవరోఒకరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వరకూ వస్తుంటుంది. కేరళలో పెళ్లయి ఆరు నెలలు కూడా గడవకుండానే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. చివరికి భార్యకు అసలు నిజం తెలిసి ఏం చేసిందంటే..

పెళ్లయిన కొన్ని నెలలకే భర్త ప్రవర్తనలో మార్పు.. చివరికి విషయం తెలుసుకుని భార్య ఏం చేసిందంటే..ప్రతీకాత్మక చిత్రం

కేరళలోని కొల్లాం జిల్లా చవారా గ్రామానికి చెందిన శ్యామ్‌లాల్, స్వాతి(22) దంపతులు. వీరికి ఆరు నెలల క్రితమే వివాహమైంది. ఇద్దరూ ఇష్టపడి వివాహం చేసుకోవడంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే స్వాతికి ఈ సంతోషం కొన్ని నెలలు కూడా ఉండలేదు. పెళ్లయి ఆరు నెలలు కూడా గడవకముందే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. రోజూ లాగా కాకుండా భిన్నంగా ప్రవర్తిస్తుండడంతో భార్యకు అనుమానం కలిగింది. వేరే మహిళతో భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలుసుకుని తీవ్ర మనస్థాపానికి గురైంది.

ఇంట్లోకి దొంగ దూరాడంటూ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు.. గదిలో షాకింగ్ దృశ్యం.. అసలు కథేంటో తెలిసి..

ఈ విషయమై భార్యాభర్తల మధ్య రోజూ గొడవలు జరిగేవి. కొన్నాళ్లు సక్రమంగా ఉన్న శ్యామ్‌లాల్.. తర్వాత యథావిధిగా అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. దీంతో వారి మధ్య మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. ఓరోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్యామ్‌లాల్.. చంపేస్తానంటూ భార్యను బెదిరించాడు. దీంతో స్వాతి రోజూ మరింతగా ఆలోచిస్తూ మానసికంగా కుంగిపోయింది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్యామ్‌లాల్‌ను అరెస్ట్ చేశారు.

నాలుగు నెలలుగా బాలిక ప్రవర్తనలో వింత మార్పులు.. ఓ రోజు ఉన్నట్టుండి.. ఆత్మలతో మాట్లాడొస్తానంటూ..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

చికెన్ తెస్తానని వెళ్లి.. సాయంత్రానికి కోటీశ్వరుడయ్యాడు.. దెబ్బకు ఈ పెయింటర్ రాతే మారిపోయింది.. videoమొదటి భర్త కంటే రెండో భర్త మేలనుకుంది.. కానీ, అతను కూడా... ఆ రోజు రాత్రి ఫుల్‌గా మందు తాగొచ్చి.. మాజీ ప్రియుడిపై పోలీసులకు యువతి ఫిర్యాదు.. అనుమానం వచ్చి విచారించగా.. బయటపడ్డ ‘ప్రేయసి’ బండారం!బీకాం విద్యార్థినిని ఆమె తల్లితో సహా అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంతకీ వీళ్లిద్దరూ కలిసి ఏం చేసేవాళ్లంటే..18 ఏళ్ల కూతురు కనిపించడం లేదంటూ ఓ తండ్రి ఫిర్యాదు.. పోలీసులు చెప్పింది విని అంతా షాక్.. మరో యువతితో కలిసి..9నెలల క్రితం కొడుక్కు పెళ్లి.. కాపాడండంటూ రాత్రిపూట కోడలి కేకలు.. కంగారుగా గదిలోకి ఆ తండ్రి వెళ్లి చూస్తే..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.