
కుటుంబ పోషణ నిమిత్తం అతను దూరంగా ఉంటూ కూలి పనులు చేస్తున్నాడు. కొన్ని నెలల అనంతరం భార్యను చూడాలని ఇటీవలే ఇంటికి వచ్చాడు. వచ్చీ రాగానే అతడు వినకూడని వార్త విన్నాడు. ఇదే విషయమై భార్యను నిలదీశాడు. ఈ విషయాన్ని బయట చెబితే చంపేస్తానంటూ భార్య హెచ్చరించింది. అంతటితో ఆగకుండా చివరకు ఆమె చేసిన పనికి.. ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కెడుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

జార్ఖండ్ రాష్ట్రం గిరిధి పరిధిలోని బాగోదర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆరా పంచాయతీలోని దామా గ్రామంలో రామచంద్ర మహతో(35) అనే వ్యక్తి.. భార్య కైసల్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో భార్యను గ్రామంలోనే వదిలిపెట్టి.. ఉపాధి నిమిత్తం గుజరాత్‌లో కూలి పనులు చేసుకునేందుకు వెళ్లాడు. కొన్ని నెలలుగా అక్కడే పనులు చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఈ క్రమంలో భార్యను చూసేందుకు మూడు రోజుల క్రితం సొంతూరికి వచ్చాడు. తాను దూరంగా ఉంటున్న సమయంలో తన భార్య వేరే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే విషయం రామచంద్రకు తెలిసింది. సోమవారం ఈ విషయమై ఇద్దరూ గొడవపడ్డారు.
తన విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించింది. అంతటితో ఆగకుండా ప్రియుడు తులసి సాహుకు ఫోన్ చేసి, విషయం తెలియజేసింది. ఇద్దరూ కలిసి రామచంద్రను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. సోమవారం అర్ధరాత్రి పడుకుని ఉన్న రామచంద్రపై రాయి, గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి