అతడికి అప్పుడప్పుడూ పెళ్లిళ్లు చేసుకోవడం అలవాటు.. భర్త మానసిక స్థితి గురించి మొదటి భార్య చెప్పింది విని అంతా షాక్..

ABN , First Publish Date - 2022-08-18T21:42:12+05:30 IST

భారతీయ వివాహ వ్యవస్థకు (Indian marriage system) ప్రపంచంలో ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాహానతంరం భార్యాభర్తలుగా మారి.. అదే బంధాన్ని...

అతడికి అప్పుడప్పుడూ పెళ్లిళ్లు చేసుకోవడం అలవాటు.. భర్త మానసిక స్థితి గురించి మొదటి భార్య చెప్పింది విని అంతా షాక్..
ప్రతీకాత్మక చిత్రం

భారతీయ వివాహ వ్యవస్థకు (Indian marriage system) ప్రపంచంలో ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాహానతంరం భార్యాభర్తలుగా మారి.. అదే బంధాన్ని జీవితాంతం కొనసాగిస్తారు. భర్తను కాదని మరో వ్యక్తిని, భార్యకు తెలీకుండా మరో మహిళతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం తప్పని అందరికీ తెలుసు. కానీ కొందరు, తెలిసి తెలిసి తప్పుడు పనులు చేస్తూ.. అందరికీ తలవంపులు తెస్తుంటారు. బీహార్‌లో ఇలాగే జరిగింది. ఓ వ్యక్తి తరచూ వివాహం చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. ఒకటి కాదు రెండు ఇప్పటికి ఏకంగా ఆరు వివాహాలు (Six marriages) చేసుకున్నాడు. అతడి మానసిక స్థితి గురించి మొదటి భార్య ఏం చెప్పిందంటే..


బీహార్ (Bihar) రాష్ట్రం బెగుసరాయ్ జిల్లాలో (Begusarai District) ఈ ఘటన చోటు చేసుకుంది. బరియార్‌పూర్ ప్రాంతానికి చెందిన రంజన్ కుమార్‌కు పాట్నాకు చెందిన రూబీ కుమారి అనే మహిళతో 2005లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహమైన కొన్ని నెలలు వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే రాను రాను రంజన్ కుమార్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒకే భార్యతో జీవితాన్ని కొనసాగించడం ఇష్టం లేని అతను.. కొన్నేళ్లకు ఢిల్లీకి చెందిన మరో యువతిని వివాహం (Second marriage) చేసుకున్నాడు. ఆమెతో కొన్నాళ్లు కలిసి జీవించిన అతను.. మళ్లీ మానేర్‌కు చెందిన ఓ మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు.

Viral photo: చెట్లే తన ఆవాసం.. రాత్రిళ్లు రంగు రంగు బొమ్మలతో సావాసం.. అంతా కూతురి కోసమే అంటున్న తండ్రి..


ఇలా ఏళ్లు గడిచే కొద్దీ పెళ్లిళ్లు చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. భర్త ప్రవర్తనలో మార్పు వస్తుందనే ఆశతో అతడి మొదటి భార్య ఇన్నాళ్లూ ఎదురుచూస్తూనే ఉంది. కానీ అతడు మాత్రం ఈ 17ఏళ్ల కాలంలో మొత్తం ఆరు వివాహాలు చేసుకున్నాడు. ప్రస్తుతం రంజన్‌కుమార్.. జార్ఖండ్‌కు చెందిన మహిళతో కలిసి జీవిస్తున్నాడు. చివరకు భర్తపై విరక్తిచెందిన మొదటి భార్య.. అతడి వద్దకు వెళ్లి నిలదీయడంతో ఆమెపై దాడి చేశాడు. చివరకు పోలీసులను ఆశ్రయించి భర్త నిర్వాకంపై ఫిర్యాదు చేసింది.

snake moves with legs: కాళ్లతో నడుస్తున్న పాము.. విచిత్రంగా ఉంది కదా.. చూస్తే వావ్! అనాల్సిందే..


ఈ సందర్భంగా ఆమె చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. తన భర్తకు కామంతో కూడిన మానసిక సమస్య ఉందని, దీంతో తరచూ వివాహాలు చేసుకుంటున్నాడని చెప్పింది. మార్పు వస్తుందని ఇన్నేళ్లు ఎదురుచూశానని, అయితే తన భర్తలో మాత్రం మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

భర్త తాంత్రికుడు కావడంతో తలుపులు వేసి.. పూజలు చేస్తున్నాడేమో అనుకుంది.. అయితే ఉన్నట్టుండి యువతి గొంతు వినిపించడంతో..



Updated Date - 2022-08-18T21:42:12+05:30 IST