నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వెంబడించిన యువకులు.. ఎవరూ లేని సమయం చూసి.. చివరకు..

ABN , First Publish Date - 2022-03-08T23:57:13+05:30 IST

మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు చెడు అలవాట్లకు బానిసయ్యారు. రోడ్డుపై వెళ్లే యువతులు, మహిళలను టార్గెట్ చేస్తూ మోసాలు చేస్తుండేవారు. ఇటీవల రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని...

నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వెంబడించిన యువకులు.. ఎవరూ లేని సమయం చూసి.. చివరకు..

నేటి యువతలో చాలా మంది దురలవాట్లకు బానిసలై.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం ఎక్కువవుతోంది. చదువుకుంటున్న విద్యార్థులు కూడా తమ కెరీర్ గురించి ఆలోచించకుండా హత్యలు, అత్యాచారాలకు పాల్పడి జీవితాన్ని జైలుపాలు చేసుకుంటున్నారు. అలాంటి వారిలో ఎంత పరివర్తన తేవాలని చూసినా.. ఫలితం మాత్రం ఉండడం లేదు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు చెడు అలవాట్లకు బానిసయ్యారు. రోడ్డుపై వెళ్లే యువతులు, మహిళలను టార్గెట్ చేస్తూ మోసాలు చేస్తుండేవారు. ఇటీవల రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వెంబడించారు. రోడ్డుపై ఎవరూ లేని సమయం చూసి ఒక్కసారిగా ఎటాక్ చేశారు. చివరకు ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ పరిధి మోవ్ కొత్వాలి కూడలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  మోవ్ సమీపంలోని కోరల్ ప్రాంతానికి చెందిన లోకేశ్, అర్జున్ స్నేహితులు. లోకేశ్ బీకామ్ చదువుతుండగా, అర్జున్ 9వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరూ చదువు మీద శ్రద్ధ పెట్టకుండా జులాయిగా తిరిగేవారు. ఈ క్రమంలో దురలవాట్లకు బానిసలయ్యారు. జల్సాలకు అలవాటు పడి చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఒంటరిగా వెళ్లే యువతులు, మహిళలను టార్గెట్ చేశారు. ఇటీవల ఇద్దరూ కలిసి బైకుపై వెళ్తుండగా.. కొత్వాలి కూడలి వద్ద ఓ యువతి ఫోన్‌లో మాట్లాడుతూ ఒంటరిగా వెళ్తూ కనిపించింది. కొద్ది దూరం ఆమె వెనుకే వెళ్లిన యువకులు.. ఎవరూ లేని సమయం చూసి ఒక్కసారిగా ఆమె ఫోన్‌ను లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించారు.

‘‘ఇంకోసారి ఇలా చేయను సార్.. ఇదొక్కసారి వదిలేయండి’’.. అంటూ వేడుకున్న యువతి.. అసలేం జరిగిందంటే..


అనూహ్య పరిణామానికి షాక్ అయిన యువతి గట్టిగా కేకలు వేసింది. దీంతో దూరంగా ఉన్న వారు గమనించి వెంటనే అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చారు. బైకుపై పారిపోతున్న ఇద్దరినీ పట్టుకున్నారు. జనం మొత్తం గుమికూడి దాడి చేయడం ప్రారంభించారు. దీంతో యువకులు తుపాకిని బయటికి తీసి వారిని బెదిరించారు. ఇంతలో కొందరు వెనుక నుంచి వెళ్లి తుపాకిని లాక్కుని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. ఇటీవల ఇలాంటి చోరీలు ఎక్కువయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టాటూ వేయించుకునేందుకు వెళ్లిన యువతి.. బయటికొచ్చి తన గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకుంది..

Updated Date - 2022-03-08T23:57:13+05:30 IST