ఊహించని కారణంతో మూడేళ్ల క్రితం చెట్టును పెళ్లి చేసుకున్న యువతి.. ఇప్పుడు ఏం చెప్తోందంటే..

Published: Tue, 21 Dec 2021 21:38:57 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఊహించని కారణంతో మూడేళ్ల క్రితం చెట్టును పెళ్లి చేసుకున్న యువతి.. ఇప్పుడు ఏం చెప్తోందంటే..

కొందరి నిర్ణయాలు చాలా వినూత్నంగా, ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. చూసే వారికి విచిత్రంగా అనిపించినా.. వారు అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా బలమైన కారణం ఉంటుంది. కొందరు తమ కుటుంబం కోసం నిర్ణయాలు తీసుకుంటే.. మరికొందరు సమాజం మొత్తం బాగుండాలని వినూత్న నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. యూకేలో ఓ మహిళ ఇలాగే అనూహ్య నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల క్రితం ఓ చెట్టును పెళ్లి చేసుకుంది. దీనికి ఆమె ఏం కారణం చెబుతోందంటే..

ఊహించని కారణంతో మూడేళ్ల క్రితం చెట్టును పెళ్లి చేసుకున్న యువతి.. ఇప్పుడు ఏం చెప్తోందంటే..

యూకేలో మెర్సీసైడ్‌లోని సెఫ్టన్‌లో 37 ఏళ్ల కేట్ కన్నింగ్‌హామ్ అనే మహిళ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఏళ్ల నాటి వృక్షాన్ని ఎంచుకుని 2019లో పెళ్లి చేసుకుంది. తన ఇంటిపేరును కూడా ఎల్డర్‌గా మార్చుకుంది. కుటుంబ సభ్యులందరినీ ఇంట్లో వదిలి.. ఈ నెలలో వచ్చే బాక్సింగ్ డేని తన బెటర్ హాఫ్‌తో గడపాలని ప్లాన్ చేసుకుంటుందట. ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ బలమైన కారణం ఉంది.

పాత దుస్తులను అమ్మేందుకు ఆ మహిళ ప్రయత్నిస్తే.. రూ.1.9 లక్షలు మటాష్.. అసలేం జరిగిందంటే..

రిమ్రోస్ వ్యాలీ కంట్రీ పార్క్ గుండా బైపాస్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారట. దీన్న వ్యతిరేకిస్తూ ఆమె ఆ పార్క్‌లోని ఈ పెద్ద వృక్షాన్ని పెళ్లి చేసుకుంది. పర్యావరణ హితం కోసం పోరాడిన ఎంతోమంది మహిళను ఆదర్శంగా తీసుకున్నట్లు చెబుతోంది. తాను వివాహం చేసుకున్న చెట్టును వారానికి ఐదు సార్లు సందర్శిస్తానని తెలిపింది. ఆ చెట్టుతో కలిసి మూడో క్రిస్మస్‌ని ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొంది. క్రిస్మస్‌ను పురస్కరించుకుని.. ఆ చెట్టును అందంగా అలంకరించింది. కేట్ నిర్ణయాన్ని ఆమె కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారట.

బస్సు టికెట్‌పై ఫోన్ నెంబర్ రాసి ఇచ్చిన కండక్టర్.. ఆ ప్రయాణికురాలు ఇచ్చిన ట్విస్ట్‌ మామూలుగా లేదుగా..!

ఇవి కూడా చదవండిLatest News in Telugu

రోడ్డు ప్రమాదంలోనే ఈ కుర్రాడు చనిపోయాడని పోలీసులు కూడా ఫిక్సయ్యారు.. ఐదో రోజు బయటపడిన ఒక్క వీడియోతో సీన్ రివర్స్..తలనొప్పి వస్తోంది.. మాత్రలు తీసుకురమ్మని భర్తను పంపించి.. అత్తారింట్లో మొదటిరోజే ఈ కొత్త పెళ్లికూతురి నిర్వాకానికి..పొద్దున్నే 5గంటలకు భార్య బయటకు వెళ్లడం చూసిన భర్తకు డౌట్.. వెనుకే వెళ్తే బస్టాండ్‌లో ఆమె నిర్వాకం చూసి..వచ్చిన ప్రతీ పెళ్లి సంబంధానికి నో చెప్తున్న అక్క.. అర్థం చేసుకోకుండా తమ్ముడే ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు..!Viral Video: అతడి మీదకు అమాంతం దూకేసిన సింహం.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..videoViral Video: అమ్మాయ్.. లే.. లే.. పెళ్లికొడుకు తాళి కడతాడట..! వధువుపై ఫన్నీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లుvideo
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.