పొలానికి తుపాకీ తీసుకెళ్లొద్దు.. అని సూచించిన అన్న... మాట్లాడుతుండగానే ఉన్నట్టుండి తమ్ముడు చేసిన నిర్వాకం..

Published: Tue, 17 May 2022 12:12:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పొలానికి తుపాకీ  తీసుకెళ్లొద్దు.. అని సూచించిన అన్న... మాట్లాడుతుండగానే ఉన్నట్టుండి తమ్ముడు చేసిన నిర్వాకం..

కొందరు చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని.. చివరకు హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్తుంటారు. కొందరైతే.. పెద్దవారు చెప్పే నీతులను పాటించకపోగా.. వారిపైనే దౌర్జన్యానికి పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు ఇటీవల చాలా చూశాం. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా ఇదే కోవలో ఓ ఘటన చోటు చేసుకుంది. పొలానికి తుపాకీతో తీసుకెళ్తున్న తమ్ముడిని వారించాడు. సూచనలు పాటించాల్సిన తమ్ముడు అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. మాట్లాడుతుండగానే ఉన్నట్టుండి తమ్ముడు చేసిన నిర్వాకానికి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చాంద్‌పూర్‌లోని డాటియానాలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న రూపేంద్ర(28), బ్రజ్‌వీర్‌ అనే అన్నదమ్ముల మధ్య తుపాకీ విషయమై గొడవ జరిగింది. సోమవారం రాత్రి పొలానికి కాపలాగా వెళ్లే సమయంలో బ్రజ్‌వీర్‌ తుపాకీ తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. గమనించిన అన్న రూపేంద్ర.. తుపాకీ తీసుకెళ్లొద్దు అంటూ తమ్ముడిని మందలించాడు. దీంతో బ్రజ్‌వీర్‌ ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. నాకే సలహా ఇస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అన్న మాట్లాడుతుండగానే.. తుపాకీతో కాల్పులు జరిపాడు.

కోట్లు వద్దు.. ఒక్కసారైనా కూర్చుంటే చాలంటున్న మహిళ.. ఇదేం కోరిక అని ఆవాక్కవుతున్నారా..? ఆమె సమస్యేంటో తెలిస్తే..

రూపేంద్ర కడుపులోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రూపేంద్ర మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీంచారు. తుపాకీ లైసెన్స్ వారి తండ్రి అశోక్ పేరు మీద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. సలహా ఇచ్చిన పాపానికి అన్ననే పొట్టనపెట్టుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. పెద్ద కొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

చలనం లేకుండా పడి ఉన్న తల్లి పక్కన 6నెలల చిన్నారి ఒకటే ఏడుపు.. స్థానికులు కంగారుగా వెళ్లి చూడగా..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

కాసేపట్లో పెళ్లనగా వరుడికి మైండ్‌బ్లాక్.. వధువుకు వేరే కుర్రాడితో పెళ్లి చేసిన తండ్రి.. అసలు కథేంటంటే..తాళి కట్టిన తర్వాత ఎంటరైన పోలీసులు... కాసేపటికి భర్త స్థానంలో మరిది ప్రత్యక్షం... జరిగిన విషయం తెలుసుకుని అవాక్కయిన బంధువులుViral video: రైలు నుంచి పిల్లలతో పాటూ కిందకు దూకేసిన మహిళ.. సమయానికి కానిస్టేబుల్ గమనించడంతో.. videoఆకాశంలో ఉరుములు, మెరుపుల మధ్య దూసుకొచ్చిన భారీ ఇనుప బంతులు.. తీరా ఏంటా అని పరిశీలించగా.. వదినపై ప్రేమతో భార్యను దూరం పెట్టాడు.. విషయం ఇంట్లో తెలియడంతో రోజూ గొడవలు.. ఓ రోజు అర్ధరాత్రి భార్య గదికి వెళ్లి..అంతా చూస్తుండగా... గుర్రంపై వరుడు పరార్.. అసలు కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు.. video
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.