brain health: మెదడు ఆరోగ్యం కోసం ఏం చేయాలంటే.. ఈ ఆరు సూత్రాలు పాటించి చూడండి.

ABN , First Publish Date - 2022-09-05T16:15:53+05:30 IST

మెదడు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, దానిపై ప్రతికూల ప్రభావాన్ని చూపే కారకాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

brain health: మెదడు ఆరోగ్యం కోసం ఏం చేయాలంటే.. ఈ ఆరు సూత్రాలు పాటించి చూడండి.

మెదడు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలలో ఒకటి, ఇది శరీరంలో మిగిలిన భాగాలకు బాధ్యత వహిస్తుంది. మన మానసిక స్థితి, ఆకలి, జీవక్రియ, జీర్ణక్రియ, హార్మోనల్ ఫంక్షన్స్ లను పేరేపిస్తుంది. అందువల్ల, మెదడు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, దానిపై ప్రతికూల ప్రభావాన్ని చూపే కారకాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. 


మన రోజువారీ జీవితంలో తెలియకుండా చేసే కొన్ని పనులు, అలవాట్లు మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువై మానసిక ప్రశాంతత కరువవుతుంది. మెదడు శరీరం పనితీరుకు సహాయపడే “చాలారకాల సంక్లిష్ట నెట్‌వర్క్‌లను” కలిగి ఉంటుంది. ఈ నెట్‌వర్క్‌లలో ఏదైనా పనిచేయకపోయినా మెదడుకు స్ట్రోక్, మూర్ఛ, పార్కిన్సన్స్ వ్యాధి, చిత్తవైకల్యం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మెదడును ఆరోగ్యంగా ఉంచాలంటే ఏం చేయాలి. 


1. శారీరక వ్యాయామం అవసరం : మెదడు పనితీరును కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. ఇది మెదడును ఉత్తేజపరుస్తుంది, మెదడు సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే మానసిక స్థితిని కాపాడుతుంది.


2. పోషకాహారం ముఖ్యం : మెదడు పనితీరును సంరక్షించడానికి మెదడుకు ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడానికి పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.


3. ఆరోగ్యాన్ని అదుపులో ఉంచాలి : రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, రక్తంలో చక్కెరలు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడం, ధూమపానం, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం కూడా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి.


4. నిద్ర, విశ్రాంతి అవసరం : తగినంత నిద్ర మెదడుకు ప్రశాంతతను ఇస్తుంది. మరుసటి రోజుకు శక్తినిస్తుంది. ఇది మానసిక స్థితిని స్థిరంగా ఉంచుతుంది, నిరాశకు గురయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.


5. మానసిక దృఢత్వం: మానసికంగా దృఢంగా ఉండడం అంటే పజిల్ సాల్వింగ్, క్లిష్టమైన విషయాల గురించి ఆలోచించడం వంటి మెదడును ఉత్తేజపరిచే కార్యకలాపాలు చేయడం వల్ల మెదడు రిఫ్రెష్ అవుతుంది.


6. సోషల్ లైఫ్ : సామాజిక జీవితాన్ని మెరుగుపరుచుకోవడం, ఇతరులతో స్నేహ భావాన్ని, ఆరోగ్య కరమైన వాతావరణాన్ని కలిగి ఉండటం, మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. నిరాశకు గురయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది.


వాతావరణంలో మార్పు, యుద్ధాలు, కరువు, కాలుష్యం, అనారోగ్యాలు, వింత వ్యాధులు మొదలైన కొత్త సవాళ్లను మనం ఎదుర్కొంటూనే ఉంటున్నాం, ఇలాంటి కొత్త సవాళ్ళను ఎదుర్కుంటున్నప్పుడు మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.

Updated Date - 2022-09-05T16:15:53+05:30 IST