eat ginger every day for a month : ప్రతిరోజూ అల్లం తింటే.. ఏం జరుగుతుంది.

ABN , First Publish Date - 2022-09-05T17:13:13+05:30 IST

అల్లం మన చర్మం, జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల కారణంగా ఇది స్కిన్, హెయిర్ కేర్ ప్రొడక్ట్‌గా కూడా ఉపయోగపడుతుంది.

eat ginger every day for a month : ప్రతిరోజూ అల్లం తింటే.. ఏం జరుగుతుంది.

పూర్వ కాలం నుంచి మన వంటకాలలో వాడుతున్న అల్లం గురించి మనందరికీ తెలిసిందే.. అల్లాన్ని వంటకాల్లోనూ, ఆరోగ్యం కోసం, మెడిసిన్ గా వాడుతూనే ఉన్నాం. అయితే అసలు ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో అల్లాన్ని కలిపి తీసుకుంటే అది ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం.


అల్లం మన చర్మం, జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల కారణంగా ఇది స్కిన్, హెయిర్ కేర్ ప్రొడక్ట్‌గా కూడా ఉపయోగపడుతుంది. జుట్టు పెరుగుదలను వృద్ధి చేస్తూ, చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించే అల్లాన్ని గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం.


అల్లంలో జింజెరాల్, షోగోల్, జింగిబెరెన్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. 


మంచి లక్షణాలు

అల్లంలో జింజెరాల్ అనే బయో-యాక్టివ్ పదార్థం ఉంటుంది, ఇది వికారం, వాంతులు వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పదార్ధం కీళ్లవాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అల్లంలో క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా అనాల్జేసిక్ ప్రభావంతో షోగోల్ అనే పదార్ధాన్ని కలిగి ఉంటుంది. ఇందులోని జింగిబెరెన్ ముఖ్యంగా జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది. ఇది యాంటీ-డయాబెటిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది అలాగే మెదడు పనితీరు, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.


అల్లం శరీరానికి ఇలా పని చేస్తుంది:


యాంటీ ఇన్‌ఫ్లమేటరీ: శరీరంలో వాపును వేగంగా తగ్గిస్తుంది. 


వికారం తగ్గుతుంది: రోజూ అల్లం తినడం వల్ల వికారం త్వరగా తగ్గుతుంది. చిట్కా: ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, కీమోథెరపీ చేయించుకుంటున్న వ్యక్తులు అల్లాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 


కండరాల నొప్పి తగ్గుతుంది:  కండరాల నొప్పి లేదా అవయవాలలో నొప్పి ఉన్నట్లయితే దానికి అల్లం తీసుకోవడం వల్ల నొప్పి క్రమంగా తగ్గుతుంది.


ప్రేగులను శుభ్రం చేస్తుంది: రోజూ అల్లం తినడం ప్రేగులకు, జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది.  క్రమం తప్పకుండా మలబద్ధకంతో బాధపడుతున్నట్లయితే..అల్లం చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది.


బహిష్టు నొప్పి: నెలసరి నొప్పితో బాధపడుతున్నట్లయితే దానికి అల్లం తినడం వల్ల ఉపసమనం కలుగుతుంది. అంతేకాదు ఇది తీవ్రమైన కడుపు నొప్పి నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.


కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: ఒక నెలపాటు ప్రతిరోజూ అల్లం తినడం వల్ల శరీరంలోని "చెడు" కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అల్లంలోని పదార్థాల వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్‌ల పరిమాణం తగ్గుతుంది.


రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది: అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు లేదా వైరస్ బారిన పడినట్లయితే అల్లం త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

Updated Date - 2022-09-05T17:13:13+05:30 IST