విశ్వసనీయతా లేని జగన్ జనానికి ఏం చేస్తాడు: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-07-11T22:43:54+05:30 IST

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీఎం జగన్‌ను తీవ్రంగా విమర్శించారు. సంక్షేమ పథకాల్లో పలు రకాల కారణాలతో కోత పెడుతున్న జగన్ మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు.

విశ్వసనీయతా లేని జగన్ జనానికి ఏం చేస్తాడు: చంద్రబాబు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీఎం జగన్‌ను తీవ్రంగా విమర్శించారు. సంక్షేమ పథకాల్లో పలు రకాల కారణాలతో కోత పెడుతున్న జగన్ మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు. 

విశ్వసనీయత అంటే ఇదేనా? 

‘‘అమ్మను గెంటేసినవాడు..ప్రజలకేం చేస్తాడు? జగన్‌ మోహన్ రెడ్డికి విశ్వసనీయత లేదు. మద్య నిషేధం, సీపీఎస్, అమరావతిపై..మాట తప్పి మడమ తిప్పడం విశ్వసనీయతా? బాబాయిపై గొడ్డలివేటు వేసిన నేరస్తుల్ని కాపాడటం విశ్వసనీయతా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. 

ప్రజా సంక్షేమానికి టీడీపీ హయాంలోనే ఎక్కువ నిధులు  

వైసీపీ ప్లీనరీలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌ను ఓడించడానికి పులివెందుల ప్రజలు ఎదురుచూస్తున్నారని, అందుకే ఆయనకు భయం పట్టుకుందన్నారు. టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి జగన్ కన్నా టీడీపీ హయాంలోనే సంక్షేమానికి ఎక్కువ నిధులు ఖర్చు చేశామని వివరించారు. ప్రభుత్వ స్కూళ్ల విలీనాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 51 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు.  

Updated Date - 2022-07-11T22:43:54+05:30 IST