వాట్సాప్‌ చాట్‌ ఈ జాగ్రత్తలు బెస్ట్‌

ABN , First Publish Date - 2021-03-27T06:00:36+05:30 IST

నిత్యజీవితంలో వాట్సాప్‌ వినియోగం సహజమైంది. రోజులో ఒక్కసారైనా వాట్సాప్‌ను ఉపయోగించని వారు అరుదు. మేసేజెస్‌ల షేరింగ్‌ నుంచి గ్రూప్‌ చాటింగ్‌ వరకు వాట్సాప్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరింత

వాట్సాప్‌ చాట్‌ ఈ జాగ్రత్తలు బెస్ట్‌

నిత్యజీవితంలో  వాట్సాప్‌ వినియోగం సహజమైంది.  రోజులో  ఒక్కసారైనా వాట్సాప్‌ను ఉపయోగించని వారు అరుదు. మేసేజెస్‌ల షేరింగ్‌ నుంచి గ్రూప్‌ చాటింగ్‌ వరకు వాట్సాప్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరింత భద్రంగా ఉండొచ్చు. ఇలాంటి జాగ్రత్తలు ఏమిటో చూద్దాం.


1. ప్రతీ ఒక్కరినీ అనుమతించవద్దు

మీ ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌ని ఒకసారి పరిశీలించండి. చాలాకాలం టచ్‌లో లేని వారి నెంబర్లను డిలీట్‌ చేయండి. ఒకవేళ అలాంటి నెంబర్లు గల వ్యక్తులతో  మీకు భవిష్యత్తులో అవసరం ఏర్పడుతుందని భావిస్తే.. వారి నెంబర్లను వాట్సాప్‌ వరకైనా బ్లాక్‌ చేయండి.  వీరిలో గతంలో మీ ఇంట్లో పనిచేసి మానేసిన వారి నెంబర్లు సైతం ఉండొచ్చు. నేడు ప్రతీ ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌ని దాంతోపాటే వాట్సాప్‌ని ఉపయోగిస్తారన్న విషయం గుర్తుంచుకోండి.


2. ప్రొఫైల్‌ ఫొటో జాగ్రత్త

ఫ్రొఫైల్‌ ఫొటో మీ గురించి గానీ, మీ కుటుంబం గురించి గానీ ఎక్కువ సమాచారం చెప్పేలా ఉండొద్దు. సింపుల్‌ ప్రొఫైల్‌ ఫొటోనే పెట్టుకోవడం బెస్ట్‌. గ్రూప్‌ ఫొటో, అపార్ట్‌మెంట్‌ ముందు దిగిన ఫొటో,  కారు రిజిస్ట్రేషన్‌ నెంబరు తదితరాలు ఉండే ఫొటోలను వాడొద్దు.  ఇలా చేస్తే కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వారంతా చూసే ప్రమాదముంది. అయితే ఇక్కడ ప్రొఫైల్‌ పిక్‌ని అనుమతించిన వారు మాత్రమే చూసేలా వాట్సాప్‌లో మూడు అప్షన్లు ఉన్నాయి. అవి ఎవ్రివన్‌(వాట్సాప్‌ యూజర్లందరూ), మై కాంటాక్ట్స్‌(ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్టులో ఉన్నవారందరూ), నో బడీ(ఎలాంటి ఫొటోనూ యాడ్‌ చేసుకోకపోవడం ఉత్తమం). ఫొటోకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు.


3. టు స్టెప్‌ వెరిఫికేషన్‌ 

సిమ్‌ కార్డు ఫ్రాడ్‌కు గురికాకుండా టూ స్టెప్‌ వెరిఫికేషన్‌  కాపాడుతుంది. ఇతరులు మీ ఫొన్‌లోకి చొరబడి ఓటీపీని తస్కరించకుండా కూడా నివారిస్తుంది. యూజర్లందరూ తప్పనిసరిగా వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి  టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ని యాడ్‌ చేసుకోవాలి. అలా చేస్తే ఇతరులు మీకు తెలియకుండా వేరే డివైజ్‌ నుంచి మీ వాట్సాప్‌ అకౌంట్‌ని ఉపయోగించుకోలేరు.


4. టచ్‌ లేదా ఫేస్‌ ఐడీతో అకౌంట్‌ లాక్‌ 

ఇతరులు మీ అకౌంట్‌ని అక్రమంగా చూడకుండా వాట్సాప్‌ అదనపు భద్రతను కల్పిస్తోంది. ఐఫోన్‌ అయితే టచ్‌ ఐడీ లేదా ఫేస్‌ ఐడీ ద్వారా, ఆండ్రాయిడ్‌ యూజర్లు ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌ ద్వారా వాట్సాప్‌ అకౌంట్‌ని లాక్‌ చేసుకోవచ్చు. అంతేకాదు ఆటోమెటిక్‌గా అకౌంట్‌ లాక్‌ అయ్యే సౌలభ్యాన్ని కూడా వాట్సాప్‌ కల్పించింది. అందుకోసం ముందుగా వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. టాప్‌ అకౌంట్‌ని క్లిక్‌ చేస్తే, ప్రైవసీ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని క్లిక్‌ చేయగానే స్ర్కీన్‌ లాక్‌ అనే మరొక ఆప్షన్‌ కనిపిస్తుంది. ఫేస్‌ ఐడీ లేదా టచ్‌ ఐడీ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత సమయంలో ఆటోమెటిక్‌గా లాక్‌ కావాలో నిర్దేశించుకొని సదరు ఆప్షన్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు.


5.స్టేటస్‌ మెసేజ్‌ షేరింగ్‌

స్టేటస్‌ మెసేజ్‌ మీ గోప్యతకు సంబంధించింది. కేవలం స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకోవాలి. అంతేగానీ మీ ఫోన్‌ కాంటాక్ట్‌లో ఉన్న పేపర్‌ బాయ్‌, పనిమనిషులు వగైరా చూడటానికి కాదు. కాబట్టి వీరిని నివారించేందుకు వాట్సాప్‌ కల్పించే ప్రైవసీ సెట్టింగ్స్‌ని ఉపయోగించుకోవాలి.


6.ప్రతి ఒక్కరినీ వాట్సాప్‌ గ్రూప్‌లోకి అనుమతి 

వాట్సాప్‌ యూజర్లు చేసే పెద్ద పొరపాటు ఎవరిని పడితే వారిని గ్రూప్‌లో యాడ్‌ చేసుకోవడం. దీనిని నివారించాలి. గ్రూప్‌లో ఎవరిని చేర్చుకోవాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. అందుకనుగుణంగా ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎవ్రివన్‌, మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌ అనే అప్షన్లలో మీకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవాలి.


7.మీడియా ఫైల్స్‌ డిజేబుల్‌

మీడియా ఫైల్స్‌ ఫోన్‌ గ్యాలరీలోకి డంప్‌ అవడాన్ని పూర్తిగా నివారించాలి. ఇలా చేయకుంటే అనవసర మీడీయా ఫైల్స్‌, ఫోటోలు అన్నీ  ఫోన్‌లో ఆటోమెటిక్‌గా సేవ్‌ అవుతూ మెమరీ స్పేస్‌ని తినేస్తాయి.  వాట్సాప్‌ సెట్టింగ్‌లోకి వెళ్లి  మీడియా ఫైల్స్‌ ఆప్షన్‌ని డిజేబుల్‌ చేయాలి.


8.గూగుల్‌ డ్రైవ్‌/ఐక్లౌడ్‌లో చాట్స్‌ ఆటో బ్యాకప్‌ 

ఐక్లౌడ్‌ లేదా గూగుల్‌ డ్రైవ్‌లో వాట్సాప్‌ చాట్‌ని బ్యాకప్‌ చేయడం గోప్యత రీత్యా సరైంది కాదు. ఒక వేళ మరీ ముఖ్యమైనవి అని భావిస్తే వాటిని భద్రంగా ఉండే మరో చోటకు ట్రాన్స్‌ఫర్‌ చేసి సేవ్‌ చేసుకోండి.


9.అశ్లీల క్లిప్పింగ్‌ల షేరింగ్‌

పోర్నోగ్రఫీని షేర్‌ చేసే వారిపట్ల వాట్సాప్‌ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాట్సాప్‌ సదరు అకౌంట్‌ని నిషేధిస్తుంది.


10.నిర్ధారణకాని వార్తల షేరింగ్‌

రోజూ ఎన్నో నిర్ధారణ కాని, వాస్తవ విరుద్ధమైన మెసేజ్‌లు వస్తుంటాయి. వీటిని ఫార్వర్డ్‌ చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వార్తల పట్ల పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు.

 

11. ద్వేషిం కలిగించే మెసేజ్‌లు

ఫేక్‌ న్యూస్‌ విషయంలో మాదిరిగానే ఇలాంటి సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపట్ల కూడా వాట్సాప్‌ కఠినంగా వ్యవహరిస్తుంది. 


12. ఇతరుల పేరుతో అకౌంట్‌ ఓపెన్‌ 

ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల పేర్లతో వాట్సాప్‌ అకౌంట్‌ను ఓపెన్‌ చేయవద్దు. ఇలా చేయడం నేరం.


13. అనవసర మెసేజ్‌లు సేవ్‌ చేయడం

మనకు వచ్చిన ప్రతీ మెసేజ్‌కు కొంత కాలపరిమితి ఉంటుంది. వాటిలో కొన్నింటిని, మరీ ముఖ్యమైనవని భావిస్తేనే సేవ్‌ చేసుకోవాలి. మిగతా వాటిని చదివిన వెంటనే డిలీట్‌ చేయాలి. అలా వీలు కాని పక్షంలో ప్రతి ఏడు రోజులకు ఒకసారి చాటింగ్‌ ఆటో క్లీన్‌ అయ్యేలా ఆప్షని ఉపయోగించుకోవాలి.


14.డివైజ్‌ లింకింగ్‌ సెక్యూరిటీ ఆన్‌ 

అకౌంట్‌ని డెస్క్‌టాప్‌కు లింక్‌ చేసుకునే క్రమంలో వాట్సాప్‌ అదనపు భద్రతను కల్పిస్తోంది. దీనివల్ల మనం వాట్సాప్‌ వెబ్‌ లేదా డెస్క్‌టాప్‌లో ఉపయోగించే ముందు ఫోన్‌లో ఫింగర్‌ ప్రింట్‌ లేదా ఫేస్‌ రికగ్నిషన్‌ ద్వారా అన్‌లాక్‌ చేయాలనే సూచన వస్తుంది. అలాగే ఎవరైనా డెస్క్‌టాప్‌లో మీ అకౌంట్‌లోకి లాగిన్‌ అయితే ఈ పాపప్‌ నోటీస్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

Updated Date - 2021-03-27T06:00:36+05:30 IST