వాట్సాప్‌ డెస్క్‌టాప్‌పై కొత్త ఫీచర్

ABN , First Publish Date - 2022-04-05T21:57:48+05:30 IST

యూజర్లకు బెటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్, అప్‌డేట్స్ తీసుకొస్తూనే ఉంటుంది. కొన్ని ఫీచర్స్ యాప్‌లో ఉంటే, మరికొన్ని ఫీచర్స్ డెస్క్‌టాప్ వెర్షన్‌లో మాత్రమే ఉంటాయి.

వాట్సాప్‌ డెస్క్‌టాప్‌పై కొత్త ఫీచర్

యూజర్లకు బెటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్, అప్‌డేట్స్ తీసుకొస్తూనే ఉంటుంది. కొన్ని ఫీచర్స్ యాప్‌లో ఉంటే, మరికొన్ని ఫీచర్స్ డెస్క్‌టాప్ వెర్షన్‌లో మాత్రమే ఉంటాయి. వాట్సాప్‌ డెస్క్‌టాప్ వెర్షన్‌లో ఉన్న ఎక్స్‌క్లూజివ్ ఫీచర్.. రిచ్ లింక్ ప్రివ్యూస్. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్‌లో షేర్ అయిన లింక్స్‌కు సంబంధించి ప్రివ్యూస్ ముందుగానే చూసుకోవచ్చు. వాటిని పూర్తిగా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. డెస్క్‌టాప్‌పై ఎప్పటినుంచో ఉన్న ఈ ఫీచర్ కొద్ది రోజులు పనిచేయలేదు. టెక్నికల్ గ్లిచ్ వల్ల ఈ ఫీచర్ కొంతకాలం ఆగిపోయింది. దీన్ని గుర్తించిన వాట్సాప్ ఈ సమస్యను తొలగించింది. లోపాల్ని సరిచేసి, తిరిగి ఈ ఫీచర్ మళ్లీ తీసుకొచ్చింది. అయితే, వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌పై మాత్రమే ఇది పనిచేస్తుంది. వాట్సాప్ వెబ్‌పై పనిచేయదు. మరోవైపు కొత్త ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తున్నట్లు సమాచారం. కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకోని వారికి కూడా మెసేజ్ పంపేలా కొత్త అప్‌డేట్ తీసుకురానుంది.

Updated Date - 2022-04-05T21:57:48+05:30 IST