Whatsapp గ్రూపుల నుంచి ఇక గుట్టుచప్పుడు కాకుండా Exit కావచ్చు!

ABN , First Publish Date - 2022-05-17T22:42:37+05:30 IST

వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని చిరాకు పుట్టిస్తుంటాయి. గుడ్ మార్నింగ్‌లు, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్‌నైట్‌లు తప్ప అందులో

Whatsapp గ్రూపుల నుంచి ఇక గుట్టుచప్పుడు కాకుండా Exit కావచ్చు!

న్యూఢిల్లీ: వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని చిరాకు పుట్టిస్తుంటాయి. గుడ్ మార్నింగ్‌లు, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్‌నైట్‌లు తప్ప అందులో మరేమీ ఉండవు. ఇంకొన్ని వాటిలో పనికిరాని చెత్తాచెదారం, ఫార్వార్డ్ మెసేజ్‌లు పేరుకుపోతుంటాయి. ఈ గ్రూపుల నుంచి ఎగ్జిట్ కావాలని అనుకున్నా మొహమాటానికి కొందరు, ఎవరేమి అనుకుంటారో అన్న అనుమానంతో కొందరు గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యేందుకు సంశయిస్తుంటారు. ఇలాంటి వారి కష్టాలకు ఇక ఫుల్‌స్టాప్ పడనుంది. 


గ్రూపులోంచి తప్పుకున్నది ఎవరో అందులోని ఇతర సభ్యులకు తెలియకుండా ఉండే సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొస్తోంది. దీనివల్ల ఇష్టం లేని గ్రూపుల నుంచి, బలవంతంగా మనసు చంపుకుని ఉంటున్న గ్రూపుల నుంచి  సులభంగా ఎగ్జిట్ కావొచ్చు. వాట్సాప్ బీటా ట్రాకర్ WABetaInfo స్క్రీన్‌షాట్లను షేర్ చేసింది. గ్రూప్ నుంచి నిష్క్రమించిన విషయం గ్రూప్ అడ్మిన్స్‌కు మాత్రమే తెలుస్తుంది. అయితే, గ్రూపు సభ్యులకు మాత్రం ఈ ఎగ్జిట్ గురించి తెలియదు. అంటే గ్రూపు నుంచి ఎవరు తప్పుకున్నారన్న విషయం వారికి ఎంతమాత్రమూ తెలియదు.


ప్రస్తుతం ఎవరైనా యూజర్ గ్రూపు నుంచి ఎగ్జిట్ అయితే అందుకు సంబంధించిన నోటిఫికేషన్ అడ్మిన్ సహా గ్రూపులో అందరికీ కనిపిస్తుంది. అయితే, ఇకపై ఇలా ఎవరికీ తెలియకుండానే సైలెంట్‌గానే ఎగ్జిట్ అవొచ్చు. ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్టు వాట్సాప్ ఇటీవల చెప్పినప్పటికీ, కచ్చితంగా ఎప్పుడు తీసుకొస్తున్నదీ చెప్పలేదు.

Updated Date - 2022-05-17T22:42:37+05:30 IST