ప్రైవసీపై వాట్సాప్ స్టేటస్.. నవ్విపోతున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2021-01-18T00:37:43+05:30 IST

ఇటీవల ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలపై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ ప్రైవసీ పాలసీలు, యూజర్ల డేటా భద్రతపై తమ విధానాలను

ప్రైవసీపై వాట్సాప్ స్టేటస్.. నవ్విపోతున్న నెటిజన్లు!

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలపై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ ప్రైవసీ పాలసీలు, యూజర్ల డేటా భద్రతపై తమ విధానాలను వినియోగ దార్లతో పంచుకోవాలని వాట్సాప్ కంపెనీ భావించింది. దీని కోసం తమ కంపెనీ తరఫున ఓ స్టేటస్ క్రియేట్ చేసి దాన్ని యూజర్లందరికీ కనిపించేలా చేసింది. ఈ స్టేటస్‌లో ‘మీ కాంటాక్టుల డేటాను వాట్సాప్.. ఫేస్‌బుక్‌తో పంచుకోదు’, ‘మీరు లొకేషన్ షేర్ చేసినా దాన్ని వాట్సాప్ చూడలేదు’ వంటి వాక్యాలు కనిపించాయి. దీనిపై నెటిజన్లు తెగ జోకులు వేసుకుంటున్నారు. ‘‘ ఇదిగో ఇలా మన ప్రైవసీని వాట్సాప్ గౌరవిస్తోంది’’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.


Updated Date - 2021-01-18T00:37:43+05:30 IST