నవంబర్ 1 నుంచి ఈ ఫోన్లకు whatsapp షాక్

ABN , First Publish Date - 2021-10-30T00:33:24+05:30 IST

మీరు కనుక పాత స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నట్టు అయితే వెంటనే మీరు కొత్త దానితో అప్‌గ్రేడ్

నవంబర్ 1 నుంచి ఈ ఫోన్లకు whatsapp షాక్

న్యూఢిల్లీ: మీరు కనుక పాత స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నట్టు అయితే వెంటనే మీరు కొత్త దానితో అప్‌గ్రేడ్ చేసుకోవడం మంచిది. లేదంటే మీరు వాట్సాప్ సేవలను కోల్పోవడం ఖాయం. నవంబరు 1 నుంచి పాత ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లకు వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఇలాంటి వార్తలు వస్తున్నప్పటికీ ఈసారి మాత్రం తప్పకుండా ఆ ఫోన్లకు సేవలు నిలిచిపోతాయని వాట్సాప్ తన ‘ఎఫ్ఏక్యూ’ పేజీలో స్పష్టం చేసింది. అలాంటి ఫోన్లు కలిగిన వారు వెంటనే తమ ఫోన్లను కొత్త వాటితో అప్‌గ్రేడ్ చేసుకోవాలని కూడా సూచించింది.


ఇకపై ఆండ్రాయిడ్ 4.1, అంతకంటే కొత్త ఓఎస్‌లలో మాత్రమే పనిచేస్తుందని పేర్కొంది. నవంబరు 1వ తేదీ నుంచి ఆండ్రాయిడ్ 4.0.4 అంతకంటే పాత వెర్షన్‌తో పనిచేస్తున్న ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని పేర్కొంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో కనుక అప్‌డేట్ కాకుండా ఇక వాట్సాప్‌ను మర్చిపోవాల్సిందేనని హెచ్చరించింది.


 అలాగే, యాపిల్ ఐఫోన్ పాత ఫోన్లలోనూ వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని మెసేజింగ్ యాప్ తెలిపింది. ఐవోఎస్ 9 అంతకంటే తక్కువ వెర్షన్ ఓఎస్‌తో పనిచేసే ఫోన్లకు కూడా వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని పేర్కొంది. ఐవోఎస్ 10, అంతకంటే కొత్త ఓఎస్‌లపై మాత్రమే వాట్సాప్ పనిచేస్తుందని వివరించింది.  

Updated Date - 2021-10-30T00:33:24+05:30 IST