WhatsInTheGame: స్పోర్ట్స్ వార్తలన్నీ ఒకే యాప్ లో..అరవై పదాల్లోనే సమాచారమంతా..

ABN , First Publish Date - 2022-08-01T18:06:19+05:30 IST

వేర్వేరు స్పోర్ట్స్ వెబ్ సైటుల్లో వచ్చే సమాచారాన్నంతా ఒక చోట కూర్చి చూపిస్తుంది. స్పోర్ట్స్ ప్రపంచంలో ఏం జరిగినా దాన్ని అప్డేట్ చేస్తుంది.

WhatsInTheGame: స్పోర్ట్స్ వార్తలన్నీ ఒకే యాప్ లో..అరవై పదాల్లోనే సమాచారమంతా..

బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్, పారా స్పోర్ట్స్, హాకీ, ఫార్ములా 1, WWE, అథ్లెటిక్స్, ఇలా ఒలింపిక్, నాన్-ఒలింపిక్, పారా స్పోర్ట్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎప్పుడు ఏ స్పోర్ట్స్ లో ఎవరు పతకాలు గెలిచారు. గేమ్స్ లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనే సమాచారాన్ని మనం పేపర్స్, మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే దాదాపు చాలా గేమ్స్ కి సంబంధించి సమాచారాన్ని సరిగా అందుకోలేకపోతున్నామనే చెప్పాలి. ఈ సమాచారాన్నంతా ఒకేచోట తెలుసుకునేందుకు వాట్సా ఇన్ ద గేమ్, Gen-Z యాప్ ఆటల గురించిన సమాచారాన్ని మినీ సైజ్ లో అందరికీ అందుబాటులోకి తెస్తున్న యాప్ ఇది. షార్ట్ న్యూస్ నుంచి స్పోర్ట్స్ షెడ్యూల్స్, వీడియోలు, రిజల్ట్ కార్డ్ లు, ప్రత్యేక వీడియో ఇంటర్వ్యూలు ఇలా స్పోర్ట్స్ గురించి ఎంతో సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.  


అసలు WhatsInTheGame ప్రధాన ఉద్దేశమే క్రీడా ప్రపంచంలోని వార్తలను తాజాగా అరవై పదాలకు మించకుండా కొత్తగా సులభంగా అందించాలని. ఈ ఆలోచన అనిల్ కుమార్ అనే కుర్రాడిది. ఇండియన్ బాడ్మింటన్ ఆటగాడు బి. సాయి ప్రణీత్ తో కలిసి ఇతను ఒక app ని స్టార్ట్ చేశాడు. అనిల్ కుమార్ దీన్ని మొదలుపెడితే, బి. సాయి ప్రణీత్  దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్నాడు. వాట్స్ ఇన్ ద గేమ్ ఈ ఏప్ ఒక స్పోర్ట్ వెబ్ సైట్లకి అగ్రిగేటర్ లాంటిది. అంటే వేర్వేరు స్పోర్ట్స్ వెబ్ సైటుల్లో వచ్చే సమాచారాన్నంతా ఒక చోట కూర్చి చూపిస్తుంది. స్పోర్ట్స్ ప్రపంచంలో ఏం జరిగినా దాన్ని అప్డేట్ చేస్తుంది. 


ఆటలకి సంబంధించి లేటెస్ట్ గా ఏం న్యూస్ జరుగుతుందో దాన్ని జాతీయ, అంతర్జాతీయ సోర్సుల నుంచి సేకరిస్తుంది. ఆ సమాచారాన్ని 60 గానీ, అంతకన్నా తక్కువ గానీ పదాల్లో ప్రెజెంట్ చేస్తుంది. అది ఏప్ ని యూజ్ చేసేవాళ్ల ఇష్టాయిష్టాలని బట్టి వాళ్లకి నచ్చే క్రీడల వివరాలని ఎక్కువగా చూపిస్తుంది. అది ఇప్పుడు జరుగుతున్న ఆటల టోర్నమెంట్ల గురించి కావచ్చు, వాటి షెడ్యూల్స్ గురించి కావచ్చు, ఎప్పుడో జరిగిన ఆట తాలూకు హిస్టారికల్ ఫాక్ట్స్ కావచ్చు. స్పోర్ట్స్ ఫాన్స్ కే కాకుండా, క్రీడాకారులకి, క్రీడల కోచ్ లకి కూడా ఉపయోగపడేలా ఈ ఏప్ తయారు చేశారు. క్రీడాకారులకి ఆటలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి, కార్పొరేట్ ఫండింగ్ లాంటి కష్టమైన పనుల్లో వాళ్లకి సాయం చేసి పెట్టడానికి ఇది హెల్ప్ చేస్తుంది. 


త్వరలో ఈ ఆప్ యూజ్ చేసే క్రీడాకారులకు, ఏదన్నా ఆట మీద ఇష్టం ఉన్నవాళ్లకు ఆ రంగంలో నిపుణులతో కనెక్ట్ కాగలిగే అవకాశం కూడా ఇందులో కల్పించబోతున్నారు. అంటే ఈ ఏప్ ద్వారా సీనియర్ క్రీడాకాలతో గానీ, సీనియర్ కోచ్ లతో గానీ, డైటీషియన్లతోగానీ, ఫిజీషియన్లతో గానీ టచ్ లోకి వెళ్లవచ్చు. వాళ్ల నుంచి ఆడియో కాలింగ్, విడియో కాలింగ్, లేదా చాట్ ఆప్షన్ల ద్వారా సాయం పొందేందుకు ఇది మీడియేటర్ గా హెల్ప్ కూడా చేయబోతోంది.


త్వరలో  క్రీడల్లో ఆన్ లైన్ కోచింగ్ కూడా మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక ఆటకు సంబంధించి ఎలా ఆడాలో అన్నది ఆ ఆటలో ఎక్స్ పర్టుల నుంచి కోచింగ్ వీడియోల్లాగ తయారు చేసి పెడుతుంది. ఆ ఆట నేర్చుకోవాలన్న ఇష్టం ఉన్న వాళ్లు కొంత డబ్బు చెల్లించి ఆ ఆటని నేర్చుకోవచ్చు. 77 ఆటల్లో ఈ సేవలు అందించబోతున్నారు.


చాలా ఫీచర్లు ఉన్నాయి:


● అన్ని స్పోర్ట్స్ అప్‌డేట్‌లు, టోర్నమెంట్‌లు గురించిన వివరాలతో కూడిన సమాచారాన్ని 60-పదాలతో వార్తలను అందిస్తుంది.


● విశ్వసనీయ సమాచారాన్ని అందివ్వడంతో పాటు కవరేజీని ఫోన్ యాప్ లో చదవడానికి సులభమైన స్వైప్ కలిగి ఉంది.


● ఏ స్పాట్స్ కి సంబంధించిన కీవర్డ్‌ని టైప్ చేసినా చిన్న వార్తలను కూడా మీ ముందుకు తెస్తుంది.


●  సోషల్ మీడియా హ్యాండిల్‌లకు సులభంగా షేర్ చేయవచ్చు. Whatsapp, Facebook, LinkedIn, Twitter, Telegram మొదలైన అన్ని హ్యాండిల్‌లకు జతచేయచ్చు.


● సింపుల్ టచ్‌తో న్యూస్ కార్డ్‌ని తర్వాత చదవడానికి బుక్‌మార్క్ చేసుకోవచ్చు.


● ఇష్టమైన క్రీడకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసార షెడ్యూల్‌లను, రాబోయే టోర్నమెంట్‌ల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.


● అథ్లెట్ల వీడియో ఇంటర్వ్యూలు, రీల్‌లను సులభంగా చూడవచ్చు.

Updated Date - 2022-08-01T18:06:19+05:30 IST