ఆరేళ్ల బాలిక.. స్కూల్ బస్సులో ఇంటికి తిరిగి వస్తుండగా ఘోరం.. బస్సు తలుపులు తెరిచి ఉండటంతో..

ABN , First Publish Date - 2022-07-19T01:12:20+05:30 IST

ఆరేళ్ల ఆ బాలిక ఒకటో తరగతి చదువుతోంది.. రోజూ ఇంటి నుంచి పాఠశాలకు స్కూల్ బస్‌లో వెళ్లి వస్తుంటుంది

ఆరేళ్ల బాలిక.. స్కూల్ బస్సులో ఇంటికి తిరిగి వస్తుండగా ఘోరం.. బస్సు తలుపులు తెరిచి ఉండటంతో..

ఆరేళ్ల ఆ బాలిక ఒకటో తరగతి చదువుతోంది.. రోజూ ఇంటి నుంచి పాఠశాలకు స్కూల్ బస్‌లో వెళ్లి వస్తుంటుంది.. ప్రతిరోజూ మధ్యాహ్నం 2:10 గంటలకు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుంది.. ఈ నెల 13 మధ్యాహ్నం 2:30 గంటలకు తను దిగాల్సిన స్టాప్ వద్దకు బస్సు చేరుకుంటున్న సమయంలో ఆ బాలిక తలుపు దగ్గరకు వెళ్లింది.. అయితే బస్సు తలుపు తెరిచి ఉండడంతో ఆ బాలిక కింద పడిపోయింది.. ఆమె మీద నుంచి బస్సు వెనక చక్రం వెళ్లిపోయింది.. దీంతో ఆమె కాళ్లు, చేతులు, పక్కటెముకులకు తీవ్ర గాయాలయ్యాయి.. ప్రస్తుతం ఆ బాలిక హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతోంది. 


ఇది కూడా చదవండి..

8 నెలల గర్భిణి.. మాతృత్వాన్ని ఆస్వాదించాల్సింది పోయి ఆత్మహత్యాయత్నం.. అసలేమైందని పోలీసులు ఆమెను అడిగితే..


హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన గగన్‌దీప్ అనే వ్యక్తి ఆరేళ్ల కూతురు సీరత్ గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మొదటి తరగతి చదువుతోంది. తన కుమార్తె సీరత్ ప్రతిరోజూ మధ్యాహ్నం 2:10 గంటలకు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుందని, అయితే ఈ నెల 13న, బస్సు నుంచి కిందపడిపోయి తీవ్ర గాయాలపాలైందని గగన్ దీప్ పేర్కొన్నారు. బస్సు డ్రైవర్, హెల్పర్ నిర్లక్ష్యం వల్లే తన కూతురు ప్రాణాపాయ స్థితిలో పడిందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


బస్సు వెనక చక్రం కింద బాలిక పడిపోవడంతో ఆమె చేయి, కాలు, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆ బాలికను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతోంది. బస్సు డ్రైవర్, హెల్పర్ నిర్లక్ష్యం వల్లే తన కూతురు కిందపడిపోయిందని గగన్‌దీప్ ఆరోపించారు. పాఠశాల యాజమాన్యంపై కూడా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2022-07-19T01:12:20+05:30 IST