మొలకెత్తిన ఽధాన్యం కొనుగోలుపై ఉన్నతాధికారులకు నివేదిక

ABN , First Publish Date - 2022-05-16T06:48:03+05:30 IST

రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనేందుకు అనుమతి కోసం ఉన్నతాధికారులకు నివేదించామని వ్యవసాయాధికారిణి వై.శోభ తెలిపారు.

మొలకెత్తిన ఽధాన్యం కొనుగోలుపై ఉన్నతాధికారులకు నివేదిక

ఉప్పలగప్తం, మే 15: రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనేందుకు అనుమతి కోసం ఉన్నతాధికారులకు నివేదించామని వ్యవసాయాధికారిణి వై.శోభ తెలిపారు. రైతులను గాలికొదిలేశారు శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన వార్తకు ఆమె స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాను వ్యవసాయ సిబ్బందితో పొలాల్లో దాళ్వా పంటను పరిశీలించినట్టు ఆమె ఆదివారం ప్రకటన విడుదల చేశారు. పనల్లో గింజలు నూరుశాతం మొలకెత్తినట్టు రైతులు చూపించారని, ఉపాఽధి పనుల కారణంగా కూలీలు దొరకనందున పంటను మాసూళ్లు చేసుకోలేకపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. పంట నష్టాల సర్వేకు ఆర్బీకే స్థాయిలో బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మూడో వంతు పంట దెబ్బతిన్నప్పుడే నష్ట పరిహారానికి అవకాశం ఉంటుందని చెప్పారు. 

 


Updated Date - 2022-05-16T06:48:03+05:30 IST