అనుష్క డిజిటల్ ఎంట్రీ ఎప్పుడు..?

May 9 2021 @ 10:31AM

అనుష్క శెట్టి డిజిటల్ ఎంట్రీ  ఎప్పుడు అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 15ఏళ్ళు అవుతోంది. ఈ 15ఏళ్లలో ఈమె చేసిన సినిమాలలో సూపర్ హిట్స్ చాలానే ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన అనుష్క కోలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా వెలిగింది. ముఖ్యంగా అరుంధతి తర్వాత ఈమె కోసం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కించేదుకు మేకర్స్ ఎక్కువగా ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే పంచాక్షరి, సైజ్ జీరో, భాగమతి,  నిశ్శబ్ధం సినిమాలొచ్చాయి. కానీ అరుంధతి రేంజ్ హిట్ మాత్రం దక్కలేదు. సైజ్ జీరోతో చేసిన ప్రయోగం కూడా కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడింది లేదు. ఇక  నిశ్శబ్ధం తర్వాత అనుష్క నుంచి కొత్త సినిమా ప్రకటన ఏదీ రాలేదు. తమన్నా, సమంత, కాజల్ అగర్వాల్, త్రిష, నయనతార డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ చేస్తూ కొత్త దారిలో సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అనుష్క అలాంటి ప్రయత్నాలేవీ చేస్తున్నట్టు కనిపించడం లేదు. అభిమానులు మాత్రం అనుష్క డిజిటల్ ఎంట్రీ ఇస్తే చూడాలని ఆశపడుతున్నారట. మరి ఈమె డిజిటల్ ఎంట్రీ ఇస్తుందా లేదా చూడాలి. ప్రస్తుతానికైతే యూవీ క్రియేషన్‌లో ఒక సినిమా చేయబోతోందని సమాచారం.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.