రేషన్‌ పంపిణీ పూర్తయ్యేదెన్నడో..!

ABN , First Publish Date - 2022-08-08T06:31:38+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నగదు బియ్యం, కందిపప్పు, చక్కెర పంపిణీ మొదలైంది.

రేషన్‌ పంపిణీ పూర్తయ్యేదెన్నడో..!

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 7: జిల్లావ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నగదు బియ్యం, కందిపప్పు, చక్కెర పంపిణీ మొదలైంది. ప్రతినెలా ఒకటి నుంచి 17వ తేదీ మధ్య ఎండీయూ వాహనాలతో నగదు రేషన్‌, కందిపప్పు, చక్కెర పంపిణీ ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తారు. 18నుంచి 30వ తేదీ మధ్య రేషన్‌ దుకాణాల ద్వారా ప్రధానమంత్రి గరీబ్‌కళ్యాణ్‌ అన్నయోజన కింద ఉచిత రేషన్‌ పంపిణీ చేస్తారు. నాలుగు నెలల విరామం తర్వాత రేషన్‌ దుకాణాల ద్వారా పీఎంజీకేఏవై కింద ఈ నెల ఒకటో తేదీ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతిరోజూ ఉచిత రేషన్‌ పంపిణీ జరుగుతోంది. ఎండీయూ వాహనాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సరుకులను ఇళ్ల వద్దకే తీసుకెళ్లి పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ పంపిణీ ఎప్పటివరకు జరుగుతుం దో తెలియక కార్డుదారులు అయోమయంలో పడ్డారు. నెల పూర్తిగా పంపిణీ చేస్తారా? లేదంటే ఈ నెల 17వ తేదీ వరకేనా అని డీలర్లను కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందలేదని పౌరసరఫరాల శాఖాధికారులు అంటున్నారు.

Updated Date - 2022-08-08T06:31:38+05:30 IST