Men should shampoo daily or not : మగవారు తలస్నానం ఎప్పుడు చేయాలి.. అస్తమానూ తలస్నానం చేయడం వల్ల జుట్టుకు ఎలాంటి హాని జరుగుతుంది.

ABN , First Publish Date - 2022-08-29T15:54:16+05:30 IST

పొట్టి జుట్టు ఉన్న మగవారు ఎన్నిసార్లు తలస్నానం చేయాలి. ఈ నిర్లష్యం వెంట్రుకలు రాలిపోయి తొందరగా బట్టతల వచ్చేట్టు చేస్తుందా?

Men should shampoo daily or not : మగవారు తలస్నానం ఎప్పుడు చేయాలి.. అస్తమానూ తలస్నానం చేయడం వల్ల జుట్టుకు ఎలాంటి హాని జరుగుతుంది.

కొందరు మగవారు తలస్నానం చేయాలంటే బద్దకిస్తారు. స్టైల్ చేసి రకరకాల హెయిర్ క్రీమ్ లు, లోషన్స్ వాడతారు. నూనె పెట్టాలన్నా, తలస్నానం చేయాలన్నా ఇష్టపడరు. మరికొందరు తరచుగా తలస్నానాలు చేస్తారు. అసలు పొట్టి జుట్టు ఉన్న మగవారు ఎన్నిసార్లు తలస్నానం చేయాలి.  ఈ నిర్లష్యం వెంట్రుకలు రాలిపోయి తొందరగా బట్టతల వచ్చేట్టు చేస్తుందా? 


పురుషుల జుట్టు పొట్టిగా ఉండి గాలి తగిలేందుకు వీలుగా ఉంటుంది. అలాగే దుమ్ము కూడా చాలా ఈజీగా వచ్చి చేరుతుంది. అయితే మగవారు జుట్టును రకరకాల స్టైల్స్ చేసుకోవడానికి ఇష్టపడతారు. దానికి తగ్గట్టు రకరకాల షాంపూలు వాడతారు. తలస్నానం కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీనివల్ల వెంట్రుకలు రంగు మారడం, ఊడిపోవడం జరుగుతుంది. 


దీనికి కారణాలు ఏంటనేది తెలుసుకుందాం. 


మొదటిది మీరు వాడుతున్న షాంపూ ఆడవారిదా, లేక మగవారిదా అనేది చూసుకోవాలి. అస్తమానూ క్లీన్ చేసుకోవడం వల్ల జుట్టుకు ఎలాంటి హాని జరుగుతుంది అనేది చూడాలి. 


**ఎవరైతే రోజూ తలకు నూనె రాస్తారో వాళ్ళు రోజూ తలస్నానం చేయాలి. 

** రోజూ ఫీల్డ్ వర్క్ లో ఉండేవారు అంటే ఆరుబయట గాలికి, దుమ్ముకు వర్క్ చేస్తారో వాళ్ళు రోజూ తలస్నానం చేయాలి.

** ఎవరైతే వేడి ఉష్ణోగ్రతలు ఉన్న చోట వర్క్ చేస్తారో  ఆ మగవారు తప్పకుండా తలస్నానం చేయాలి. 


మీ జుట్టు జిడ్డుగా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకుంటారు.?

** మన స్కాల్ఫ్ లక్షణం జుట్టు జిగటను, తేమను, జిడ్డుతనాన్ని దానంతట అదే పీల్చుకుంటుంది.

** కొందరిలో తలలో చమట వల్ల జిడ్డు కారణంగా చుండ్రు పేరుకుపోయి కనిపిస్తుంది.  ఇలాంటి వారు జుట్టు విషయంలో చాలా కేర్ తీసుకోవాలి.

** దుమ్ము, కాలుష్యం వల్ల స్కాల్ఫ్ దుర్వాసన రావడం మొదలవుతుంది.


ఎవరు రోజూ తలస్నానం చేయకూడదు.

**  జుట్టు పొడిబారునట్టుగా కాంతిహీనంగా ఉంటుందో వాళ్ళు రోజూ తలస్నానం చేయకూడదు. ఎందుకంటే వీళ్ళలో వెంట్రుకలు త్వరగా తెల్లబడిపోతాయి, అలాగే జుట్టు రాలడం కూడా మొదలవుతుంది.

** ముందు రోజు షాంపూతో తలస్నానం చేసిట్టయితే మరుసటి రోజు చల్లని నీటితో తలను శుభ్రం చేసుకుంటే చాలు. 

**  పొడిబారిన జుట్టు ఉన్నవారు తరచుగా చమట పట్టే గుణం కలిగి ఉన్నట్లయితే వీళ్ళు తలస్నానం చేసిన మరుసటిరోజు మాత్రం తేనె, అలోవీరా జెల్ కలిపి తలకు పట్టించి, తరువాత చల్లని నీటితో తల స్నానం చేయాలి. 

Updated Date - 2022-08-29T15:54:16+05:30 IST