
పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది.. బంధుమిత్రులు ఎంతో సంతోషంగా పెళ్లి వేడుకలో పాల్గొంటున్నారు.. పెళ్లి మండపంపై వధూవరులు డ్యాన్స్ కూడా చేశారు.. ఆ సమయంలో బలమైన గాలులు వీయడంతో ఒక్కసారిగా పందిరి కూలిపోయింది.. ఆ హఠాత్పరిణామానికి షాకైన జనం అక్కణ్నుంచి పరుగులు తీశారు.. అప్పటి వరకు హుషారుగా చిందులేసిన జనం భయంకరంగా కేకలు పెడుతూ అక్కణ్నుంచి పారిపోయారు.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఉత్తరాఖండ్‌లోని శాంతిపురిలో ఈ నెల 12వ తేదీన వివాహం జరిగింది. వివాహానంతరం వధూవరులు బంధుమిత్రులతో కలిసి చిందులేశారు. వధువు, వరుడు కలిసి డ్యాన్స్ చేస్తున్న సమయంలో బలమైన గాలులు వీయడం ప్రారంభమైంది. దాంతో ఒక్కసారిగా వారు ఉన్న పందిరి కూలిపోయింది. దీంతో అక్కడున్న వారందరూ కేకలు పెడుతూ అక్కణ్నుంచి పారిపోయారు. ఆ ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక మహిళ మెడకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి