లెక్క తేలేదెప్పుడో?

ABN , First Publish Date - 2020-11-29T05:10:14+05:30 IST

జిల్లా వ్యాప్తంగా అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రోజురోజుకు విస్తరిస్తున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా కొందరు లేఅవుట్లు వేస్తున్నారు. అటు అధికారులు పట్టకుండా వ్యవహరిస్తుండడంతో వీటి సంఖ్య పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 352 అనధికార లేఅవుట్లు ఉన్నట్టు ఆయా శాఖ అధికారులు గుర్తించారు.

లెక్క తేలేదెప్పుడో?
అనధికార ఇటువంటి లేవుట్లు ఎన్నో

 జిల్లాలో 352 అనధికార లేఅవుట్లు

అనుమతులు లేకుండా నిర్మాణాలు

ప్రభుత్వ ఆదాయానికి గండి

పట్టించుకోని అధికారులు

(కలెక్టరేట్‌/పార్వతీపురం)

జిల్లా వ్యాప్తంగా అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రోజురోజుకు విస్తరిస్తున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా కొందరు లేఅవుట్లు వేస్తున్నారు. అటు అధికారులు పట్టకుండా వ్యవహరిస్తుండడంతో వీటి సంఖ్య పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 352 అనధికార లేఅవుట్లు ఉన్నట్టు ఆయా శాఖ అధికారులు గుర్తించారు. వాటిపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. 

అనుమతులు లేకుండానే..

జిల్లాలో చాలా మండలాలు ఉడా పరిధిలో ఉన్నాయి. సాధారణంగా అన్నిరకాల అనుమతులు తీసుకున్న తరువాతే లేఅవుట్లు వేయాలి.  లేఅవుట్‌గా మార్చాలంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలి. మార్కెట్‌ రేటు ప్రకారం కొంత శాతం చలానా రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. తరువాత పంచాయతీ అనుమతి పొంది లేఅవుట్‌ వేయాలి. అక్కడ నుంచి ఉడాకు ఆయా దస్త్రాలు పంపిస్తారు. ఉడా అధికారులు వేసిన లేఅవుట్‌ను పరిశీలించి వారి నిబంధనలు ప్రకారం సక్రమంగా ఉంటే ఎల్‌పీ నంబరు మంజూరు చేస్తారు. నిబంధనలు ప్రకారం లేకపోతే ఫైల్‌ను తిరష్కస్తారు. కానీ జిల్లాలో ఎక్కడా నిబంధనలు కానరావడం లేదు. వ్యవసాయ భూమిని సైతం చదును చేసి ప్లాట్లుగా విభజిస్తున్నారు. ఎటువంటి చలానా చెల్లించడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. 

అటువైపు చూడని కార్యదర్శులు

ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. గతంలో పంచాయతీ కార్యదర్శుల కొరతను సాకుగా చూపేవారు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. సిబ్బంది కొరత తీరింది. పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించ వచ్చు. నిబంధనలు పాటిస్తున్నారా? లేదా అని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదించవచ్చు.  కానీ సచివాలయ కార్యదర్శులు వీటిపై దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు వ్యాపారులు చేస్తున్న పనికి ప్లాట్లు కొనుగోలు చేసినర వారు నష్టపోతున్నారు.  ఇటీవల ప్రభుత్వం  లేవుట్‌ రెగ్యులేషన స్కీమ్‌ (ఎల్‌ఆర్‌సీ) అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం గతంలో వేసిన లేవుట్లు కన్వర్షన లేకపోయినా?  పంచాయతీ అనుమతి లేకపోయినా? ప్రభుత్వానికి కొంత చలానా రూపంలో పన్ను చెల్లించాల్సి ఉంది. ఎల్‌ఆర్‌సీ లేకపోతే ఆయా ప్లాట్ల రిజిసే్ట్రషన జరగదు. జిల్లాలో మొత్తం  735 లేవుట్లు ఉన్నాయి. వీటిలో 382 లేఅవుట్లకు మాత్రమే అన్ని అనుమతులున్నాయి.  మిగతా 352 అనాధికార లేఅవుట్లే. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరముంది. 

దృష్టిసారించాం

పంచాయతీల్లో వెలుస్తున్న అనధికార లేఅవుట్లపై దృష్టిసారించాం. చర్యలు తీసుకుంటాం. ముందుగా లేఅవుట్లు నిబంధనలు ప్రకారం ఉన్నాయా? లేకుంటే ఎటువంటి అనుమతులు తీసుకోలేదా? అన్నది క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఈ విషయంలో కొనుగోలుదారులు సైతం అప్రమత్తంగా ఉండాలి. 

                                        - కె.సునీల్‌ రాజ్‌కుమార్‌, ఇనచార్జి డీపీవో 


Updated Date - 2020-11-29T05:10:14+05:30 IST