girlfriend వద్దకు ఫ్రెండ్స్‌ని పంపించిన police Constable.. సామాన్లు ఇంట్లో పెట్టి వెళ్తామని చెప్పి.. లోపల వారు చేసిన నిర్వాకం..

ABN , First Publish Date - 2022-08-06T22:44:03+05:30 IST

అతనో పోలీస్ కానిస్టేబుల్ (Police Constable). బాధ్యత గల వృత్తిలో ఉన్న అతను.. ప్రజలు తప్పుదారి పట్టకుండా చూడాల్సింది పోయి.. తానే తప్పులు చేసి, అందరితో..

girlfriend వద్దకు ఫ్రెండ్స్‌ని పంపించిన police Constable.. సామాన్లు ఇంట్లో పెట్టి వెళ్తామని చెప్పి.. లోపల వారు చేసిన నిర్వాకం..
ప్రతీకాత్మక చిత్రం

అతనో పోలీస్ కానిస్టేబుల్ (Police Constable). బాధ్యత గల వృత్తిలో ఉన్న అతను.. ప్రజలు తప్పుదారి పట్టకుండా చూడాల్సింది పోయి.. తానే తప్పులు చేసి, అందరితో ఛీకొట్టించుకున్నాడు. చివరకు డిపార్ట్‌మెంట్ మొత్తానికే చెడ్డ పేరు తీసుకొచ్చాడు. యువతితో సహజీవనం (Love in relationship) చేసిన అతను, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి.. చివరకు ఆమెను దారుణంగా మోసం చేశాడు. ప్రేయసి వద్దకు స్నేహితులను పంపించాడు. సామాన్లు ఇంట్లో పెట్టి వెళ్తామని చివరకు వారు చేసిన నిర్వాకంపై.. స్థానికంగా తీవ్ర  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం భోపాల్ (Bhopal) కమ్లానగర్ పరిధిలో నివాసం ఉంటున్న 23 ఏళ్ల యువతి.. ఇటీవల పోటీ పరీక్షలకు (Competitive Examinations) సిద్ధమవుతోంది. రెండేళ్ల క్రితం ఆమె స్థానికంగా ఉన్న ఓ సంస్థలో పని చేస్తుండగా.. నవీన్ పటేల్ అనే పోలీసు కానిస్టేబుల్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ రోజూ చనువుగా మాట్లాడుకునేవారు. కొన్నాళ్లకు ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడితో సహజీవనం చేసేందుకు యువతి ఒప్పుకొంది. ఉద్యోగం వదిలేసి, అతడితో పాటూ వెళ్లిపోయింది. అయితే కొన్నాళ్ల తర్వాత పెళ్లి విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. యువతి కుటుంబ సభ్యులు ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. తర్వాత పెళ్లి చేసుకుంటానని మళ్లీ యువతిని నమ్మించి తన భోపాల్‌లోని తన ఇంటికి తీసుకెళ్లాడు.

Girls Videos: యువకుడి ఫోన్లో పది మంది యువతుల అసభ్యకర వీడియోలు.. చివరకు అతడు చేసే పనేంటో తెలుసుకుని షాకైన పోలీసులు..


ఈ క్రమంలో ఆగస్టు 3న యువతి ఇంట్లో పడుకుని ఉండగా.. ప్రియుడు (boyfriend) ఫోన్ చేశాడు. ‘‘నా స్నేహితులు ఇంటికి వస్తారు.. కొన్ని సామాన్లు ఇంట్లో పెట్టి వెళ్తారు’’.. అని చెప్పాడు. తర్వాత ఆకాష్ అనే వ్యక్తి లోపలికి వచ్చి.. కాసేపటి తర్వాత యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడు వెళ్లిన కొద్దిసేపటికి ఇంకో మరో వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. అతడు కూడా అత్యాచారాం చేసేందుకు ప్రయత్నించగా.. యువతి ప్రతిఘటించింది. దీంతో ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. వారు వెళ్లిన చాలా సేపటికి నవీన్ ఇంటికి వచ్చి.. యువతిపై దాడి చేశాడు. తాను చెప్పినట్లు వినకుంటే చంపేస్తానని బెదిరించాడు. దీంతో యువతి అతడికి తెలీకుండా 100కు ఫోన్ చేసి, విషయం తెలియజేసింది. అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నవీన్‌తో పాటూ అతడి స్నేహితులపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

inhuman incident: మామ పిలవడంతో ఇంటికి వెళ్లింది.. పక్కన కూర్చోబెట్టుకుని చివరకు ఇలాంటి పని చేస్తాడని ఎవరూ ఊహించలేదు.



Updated Date - 2022-08-06T22:44:03+05:30 IST