Snake in School Bag: స్కూలు బ్యాగులోకి దూరిన పాము.. విషయం తెలీక పుస్తకాల కోసం లోపల చేయిపెట్టిన బాలిక.. చివరకు..

ABN , First Publish Date - 2022-09-24T00:42:35+05:30 IST

మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లోని దాతియాలో ఓ బాలిక స్కూల్ బ్యాగ్‌ నుంచి పాము బయటకు వచ్చింది.

Snake in School Bag: స్కూలు బ్యాగులోకి దూరిన పాము.. విషయం తెలీక పుస్తకాల కోసం లోపల చేయిపెట్టిన బాలిక.. చివరకు..

మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లోని దాతియాలో ఓ బాలిక స్కూల్ బ్యాగ్‌ నుంచి పాము బయటకు వచ్చింది. పాఠశాలకు వెళ్లిన బాలిక పుస్తకాలు తీయడం కోసం బ్యాగ్‌లో చేయి పెట్టింది. బ్యాగ్ లోపల ఆ బాలికకు పాము కనిపించింది. తీవ్రంగా భయపడిన ఆ బాలిక గట్టిగా కేకలు వేస్తూ ఆ విషయాన్ని ఉపాధ్యాయుడికి తెలియజేసింది. టీచర్ వెంటనే ఆ బ్యాగ్‌ను తీసుకుని బయటకి పరిగెత్తాడు. ఆరు బయట బ్యాగ్‌ని కదిలించగా, లోపల నుంచి రెండు అడుగుల పాము బయటకు వచ్చింది. 


ఇది కూడా చదవండి..

షాకింగ్ ఘటన.. అంత్యక్రియలు చేసిన 3 నెలల తర్వాత సమాధిని తవ్వి మృతదేహాన్ని బయటకు తీసి..


బరౌని పట్టణంలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఉమా రజక్ (16) అనే విద్యార్థిని బుధవారం ఉదయం పాఠశాలకు చేరుకుంది. క్లాసులో కూర్చున్న తర్వాత పుస్తకం తీయడానికి బ్యాగ్‌లో చేయి పెట్టంది. ఏదో కదిలినట్టు అనిపించడంతో బ్యాగ్‌ని కొంచెం తెరిచి చూసింది. లోపల పాము కనిపించింది. భయపడిన ఆ బాలిక ఉపాధ్యాయుడు విజయశంకర్‌కు విషయం చెప్పింది. టీచర్ వెంటనే ఆ బ్యాగ్ తీసుకుని తరగతి గది బయటకు పరిగెత్తాడు. స్కూలుకు రెండు కిలోమీటర్ల దూరంలోకి వెళ్లి బ్యాగును తెరిచి పామును బయటకు వదిలేశాడు.  

Updated Date - 2022-09-24T00:42:35+05:30 IST