వాట్సప్‌లో ఓ యువతి నుంచి వాయిస్ మెసేజ్.. అంతా విని అవాక్కైన పోలీసులు.. హోటల్‌కు వెళ్లి తనిఖీ చేస్తే..

ABN , First Publish Date - 2022-09-10T21:08:48+05:30 IST

ఉద్యోగాల పేరుతో మోసాలు చేయడం ఇటీవల సర్వసాధారణమైంది. కొందరైతే నిరుద్యోగ యువతులను మాయమాటలతో నమ్మించి.. చివరకు దారుణంగా మోసం చేయడం చూస్తున్నాం...

వాట్సప్‌లో ఓ యువతి నుంచి వాయిస్ మెసేజ్.. అంతా విని అవాక్కైన పోలీసులు.. హోటల్‌కు వెళ్లి తనిఖీ చేస్తే..

ఉద్యోగాల పేరుతో మోసాలు చేయడం ఇటీవల సర్వసాధారణమైంది. కొందరైతే నిరుద్యోగ యువతులను మాయమాటలతో నమ్మించి.. చివరకు దారుణంగా మోసం చేయడం చూస్తున్నాం. మరికొందరు అమాయక బాలికలు, యువతులను చివరకు వ్యభిచారంలోకి దింపడం కూడా తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. పోలీసులకు వాట్సప్‌లో ఓ యువతి నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది. అది విని అంతా అవాక్కయ్యారు. చివరకు ఆమె చెప్పిన హోటల్‌కు వెళ్లి తనిఖీ చేస్తే.. అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దుర్గ్ పరిధి భిలాయ్‌లోని ఓ హోటల్‌లో సెక్స్ రాకెట్ (sex racket) నడుస్తోందని లక్కోకు చెందిన ఓ యువతి నుంచి దుర్గ్ పోలీసులకు సెప్టెంబర్ 8న వాట్సప్‌కు వాయిస్ మెసేజ్ వచ్చింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పలువురు నిరుద్యోగ యువతులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ ఆశపెట్టడం, వారిని నమ్మి వచ్చిన వారిని హోటళ్లలో ఉంచి, వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని సదరు యువతి వాపోయింది. తాను కూడా అలాగే మోసపోయానని చెప్పింది. ఆమె ఫిర్యాదుతో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే స్పందించారు. సదరు హోటల్‌పై దాడులు చేసి, హోటల్ నిర్వాహకులతో పాటూ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. లక్నోకు చెందిన బాధితురాలికి.. దుర్గ్‌కు చెందిన అరుణ్‌కుమార్‌ సింగ్‌ అలియాస్‌ అమన్‌ ఫోన్ చేశాడు.

ఆస్పత్రిలో మహిళల ప్రసవం.. అంతలోనే అనూహ్య ఘటన.. నా పిల్లలు కాదంటే నా పిల్లలు కాదంటూ.. చివరకు..


హోటల్‌లో పని ఇప్పిస్తామంటూ నమ్మించాడు. దీంతో యువతి దుర్గ్‌కు చేరుకుని అమన్‌ను కలిసింది. అయితే హోటల్‌కి తీసుకెళ్లిన తర్వాత, వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో చిత్రహింసలకు గురి చేశాడు. చివరకు యువతి ఎలాగోలా పోలీసులకు వాట్సప్ ద్వారా సందేశం పంపింది. బాధితురాలి నుంచి అమన్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో పరిశీలించగా.. వివిధ రాష్ట్రాలకు చెందిన బాలికలు, యువతులు, మహిళల అశ్లీల ఫొటోలు బయటపడ్డాయి. అలాగే పలువురు ఫోన్ నంబర్లను కూడా గుర్తించారు. హోటల్‌లో అన్ని గదులను తనిఖీ చేసిన పోలీసులు.. ఇద్దరు మరో బాలికలను రక్షించారు. ఫోన్ నంబర్ ఆధారంగా ఉటాయ్ అనే ప్రాంతంలో ఉన్న అమన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఐదేళ్లుగా మహిళా టీచర్ వింత ప్రవర్తన.. ఓ రోజు ఫుల్ బాటిల్‌తో స్కూల్‌కు రావడంతో..



Updated Date - 2022-09-10T21:08:48+05:30 IST