Suspicious Women: ఆటో కోసం వేచి చూస్తున్న మహిళ.. పోలీసులకు అనుమానం వచ్చి.. ఆమె సూట్‌కేస్‌ను తెరచి చూడగా..

Published: Tue, 09 Aug 2022 18:55:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Suspicious Women: ఆటో కోసం వేచి చూస్తున్న మహిళ.. పోలీసులకు అనుమానం వచ్చి.. ఆమె సూట్‌కేస్‌ను తెరచి చూడగా..

కొందరు మహిళలు కొన్నిసార్లు రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు మహిళలైతే తమ పంతం నెగ్గించుకోవడానికి ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడరు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ పెద్ద సూట్‌కేస్‌ పట్టుకుని ఆటో కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులకు.. ఆమెను చూడగానే అనుమానం వచ్చింది. దీంతో చివరకు సూట్‌కేస్‌ తెరచి చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రీతి అనే మహిళ సంభాల్ ప్రాంతానికి చెందిన ఫిరోజ్‌తో నాలుగేళ్లుగా సహజీవనం (Live in relationship) చేస్తోంది. ఈమెకు అప్పటికే దీపక్ యాదవ్‌ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే విభేదాల కారణంగా అతడికి విడాకులిచ్చి (Divorce).. ఫిరోజ్‌కు దగ్గరైంది.  ఘజియాబాద్‌లోని తిలా మోర్ ప్రాంతంలో ఇద్దరూ గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇదిలావుండగా, ఇటీవల ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. అయితే ఫిరోజ్‌ వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం కూడా ఇదే విషయమై గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రీతి.. బ్లేడు తీసుకుని ఫిరోజ్‌ గొంతు కోసింది.

drunk woman: యువకుడితో పాటూ ఫుల్‌గా మందుకొట్టిన మహిళ.. అదే సమయంలో పిల్లలు వీడియో తీయడంతో.. చివరకు..

దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత మార్కెట్‌కు వెళ్లి, పెద్ద సూట్‌కేస్‌ కొనుక్కుని వచ్చింది. అందులో ప్రియుడి మృతదేహాన్ని ఉంచి, రైల్లో పడేయాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం ఆదివారం వేకువజామున.. మృతదేహాన్ని సూట్‌కేస్‌ కుక్కి, రైల్వే స్టేషన్‌కు బయలుదేరింది. ఆటో కోసం ఎదురుచూస్తుండగా.. అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చారు. ప్రీతి ప్రవర్తనలో తేడా ఉండడంతో వారికి అనుమానం వచ్చింది. దీంతో ఆమెను విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పింది. చివరకు సూట్‌కేస్‌ తెరచిచూడగా మృతదేహం (dead body) బయటపడింది. అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

Dubai jobs scam: దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. పాకిస్థాన్‌కు పంపించిన ఏజెంట్.. 20ఏళ్ల తర్వాత వృద్ధురాలి పరిస్థితి ఏంటంటే..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Viral Video: కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన తల్లీకొడుకు.. అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ గుర్తించడంతో.. videoMarriage funny video: పాపం ఏ పెళ్లికూతురికీ రాని కష్టం వచ్చిందే.. పక్కనున్న వారంతా నవ్వుతుంటే.. చివరకు ఎలాగోలా.. videoViral Video: ఈ పిల్లల సాహసం చూస్తే.. శభాష్ అని తీరాల్సిందే.. పెంపుడు కుక్క కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా..videoInstagram videos: ఇన్‌స్టాగ్రాంలో ఫేమస్ అవ్వడంపై సలహాలు ఇస్తూ.. ఓ రోజు కారు కొంటున్నా అని యువతిని తీసుకెళ్లి..Bihar News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అంతా బాగుందనుకున్న సమయంలో.. అత్తగారు బైకు కొనివ్వలేదనే కారణంతో.. Cruelty husband: అప్పులు తీర్చడం కోసం భార్యనే బలిపశువును చేశాడు. కొందరు యువకులతో కలిసి అతడు చేసిన నిర్వాకం..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.