మురుగు కష్టాలు తొలిగేది ఎప్పుడో...!

ABN , First Publish Date - 2021-02-26T05:06:38+05:30 IST

పట్టణంలోని పగడాలపల్లెలో ఓ వీధిలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోడవంతో మురికినీరు రోడ్డుపై ప్రవహిస్తోంది.

మురుగు కష్టాలు తొలిగేది ఎప్పుడో...!
పగడాలపల్లెలో ఒక వీధిలో మురుగునీరు ప్రవహిస్తున్న దృశ్యం

రైల్వేకోడూరు, ఫిబ్రవరి 25: పట్టణంలోని పగడాలపల్లెలో ఓ వీధిలో  డ్రైనేజీ వ్యవస్థ లేకపోడవంతో మురికినీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో రాత్రి వేళల్లో ప్రజలు దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. మురికినీరు ఎక్కడ పడితే అక్కడ నిలిచి పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. మురికినీటిలో పందులు సంచరిస్తున్నా యి. దీంతో ఎక్కడ వ్యాధులు ప్రబలుతాయోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కొంత భాగం అండర్‌ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక్క వీధిలో మాత్రం ఏర్పాటు చేయలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వర్షం కురిసినప్పుడు అయితే ఇంకా ఘోరంగా ఉంటుందనివాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి డ్రైనేజీ నిర్మించి మురికి నుంచి కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు.

దోమలతో అల్లాడుతున్నాం....

వీధిలో మురికినీరు ప్రవహిస్తూ కంపుకొడుతోంది. రాత్రి పూట దోమలు దాడి ఎక్కువైంది. సమస్యను గతంలో ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. వెంటనే డ్రైనేజీ నిర్మిం చి మురుగునీటి బారి నుంచి కాపాడాలి.

-షేక్‌ మహబూబ్‌బాషా, పగడాలపల్లె

Updated Date - 2021-02-26T05:06:38+05:30 IST