వ్యాక్సిన్‌కు వేళాయే

ABN , First Publish Date - 2021-01-14T05:39:37+05:30 IST

పది నెలల పాటు ప్రపంచాన్నే వణికించిన మహమ్మారి కరోనా ను నివారించేందుకు టీకాలు అందుబాటులోకి వచ్చా యి.

వ్యాక్సిన్‌కు వేళాయే

ఉమ్మడి జిల్లాలో కొవిడ్‌ టీకా వేసేందుకు ఏర్పాట్లు పూర్తి
16న పది కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌
నిజామాబాద్‌లోని 6 కేంద్రాల్లో.. కామారెడ్డిలో 4 కేంద్రాల్లో..
మొదటి విడతలో ఇరు జిల్లాల్లో 19,675 మంది
తొలి రోజు 100 మందికే టీకాలు వేయనున్న సిబ్బంది
ఈ నెల 21లోపు పూర్తికానున్న మొదటి విడత
నేడు జిల్లాలకు చేరుకోనున్న కో వ్యాక్సిన్‌ టీకాలు
టీకా నిల్వలకు ప్రత్యేక ఫీజర్ల ఏర్పాట్లు

కామారెడ్డి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): పది నెలల పాటు ప్రపంచాన్నే వణికించిన మహమ్మారి కరోనా ను నివారించేందుకు టీకాలు అందుబాటులోకి వచ్చా యి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రజలకు టీకా వేసేందుకు సిద్ధమయ్యాయి. మొదటి విడతలో ఈ నెల 16న వైద్యఆరోగ్యశాఖ సిబ్బందికి టీకా అందనుంది. దేశ వ్యాప్తంగా అదేరోజు టీకా పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్‌లోని పది కేంద్రాలలో టీకాలు వేసేందుకు ఇరు జిల్లాల వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న తొలి టీకా పంపిణీలో కొవిడ్‌ పోర్టల్‌లో ఇప్ప టికే నమోదైన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ప్రాథ మిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పార మెడికల్‌, ప్రైవేట్‌ వైద్యులు, సిబ్బంది తీసుకునే లా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల వారీగా గుర్తించిన ప్రతీ కేంద్రంలో తొలి రోజు 30 నుంచి 50మందికి మాత్రమే టీకా వేయనున్నా రు. ఇప్పటి వరకు మొదటి విడతలో ఇరు జిల్లాల నుంచి 19,675 మందికి టీకా వేసేందు కు గుర్తించి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు.
టీకా ఇచ్చేది ఇలా..
కరోనా వ్యాక్సిన్‌ను ఈ నెల 16న ప్రారంభిం చనున్నారు. మొదటి విడ తకు సంబంధించి వరుసగా నాలుగు రోజులు టీకా పంపిణీ జర గనుంది. శనివారం తొలిరోజు వైద్యసిబ్బందికి టీకా వేయగా మరుసటి రోజు ఆదివారం సెల వుకావడంతో సోమ, మంగళ, బుధవారాల్లో కొవిడ్‌ టీకాలు వేస్తారు. తర్వాత నిరంతరాయంగా టీకా వేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతీరోజు 100 మందికి టీకా వేస్తారు. వారం లో సోమ, మంగళ, గురు, శుక్రవారాలు కొవిడ్‌ టీకా వేయను న్నారు. బుధ, శనివారాల్లో పిల్లలకు సాధారణ టీకా వేస్తారు. ఒకరోజు పంపిణీ చేసిన వైద్యసిబ్బంది మరుసటిరోజు పంపి ణీ చేయరు. ఇతర సిబ్బంది తర్వాత రోజు విధులలో పాల్గొం టారు. సెలవు రోజుల్లో టీకా పంపిణీ చేయరు. మొదటిసారి టీకా తీసుకున్న కేంద్రంలోనే 28 రోజుల తర్వాత రెండో విడత టీకా తీసుకోవాల్సి ఉంటుంది. టీకా వేసిన తర్వాత అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచి పంపిస్తారు.
తొలిరోజు వ్యాక్సిన్‌ కేంద్రాలు ఇవే..
నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో మొదటి విడత కింద వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు ఇవ్వనున్నారు. ఇప్పటికే వీరందరి పేర్లను ఉమ్మడి జిల్లాల కొవిడ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఇప్పటి వరకు 19,675 మందిని గుర్తించి పోర్టల్‌లో పొందుపరిచారు. ఇందులో కామా రెడ్డి జిల్లాకు చెందిన వారు 5,214 మంది, నిజామాబాద్‌ జిల్లా కు చెందిన వారు 14,461 మంది ఉన్నారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 70 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ చేయనుండగా కామారెడ్డిలో 30, నిజామాబాద్‌ జిల్లాలో 40 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే తొలిరోజు మాత్రం 10 కేంద్రాలలోనే వైద్యఆరోగ్యశాఖ సిబ్బందికి టీకాలు వేయనున్నారు. నిజామా బాద్‌ జిల్లాలో 6 కేంద్రాలైన నిజామాబాద్‌ డిస్ర్టిక్‌ హాస్పిటల్‌, బోధన్‌ యూఎఫ్‌డబ్లుసీ, డ్రామ్‌ల్యాండ్‌, హోప్‌ ఆసుపత్రి, మనోరమ ఆసుపత్రి, మెడికేర్‌ ఆసుపత్రి, ప్రతిభ ఆసుపత్రులు ఉన్నా యి. కామారెడ్డి జిల్లాలో 4 కేంద్రాలైన కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి, కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌నగర్‌ పీహెచ్‌సీ, ఎస్‌ఎస్‌నగర్‌, భిక్కనూర్‌ పీహెచ్‌సీలలో మొద టి రోజు వ్యాక్సినేషన్‌ వేయనున్నారు.
వ్యాక్సిన్‌ స్టోరేజీకి ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 1500 వరకు వ్యాక్సినేషన్‌ డోసులు అందుబాటులోకి తీసుకురానుండగా అవి నేడు జిల్లాలకు చేరుకోనున్నాయి. ప్రతీ ట్యూబ్‌లో 5 ఎంఎల్‌ వ్యాక్సిన్‌ ఉండగా ఒక ట్యూ బ్‌ ద్వారా 10 మందికి వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఈ వ్యాక్సిన్‌లకు స్టోరేజీకి జిల్లా కేంద్రాలలో ఉన్న సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌లను మొదటి ఈ వ్యాక్సినేషన్‌ నిల్వలకు వాడుకోనున్నారు. అక్కడి నుంచి ఆయా పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆసు పత్రులకు వ్యాక్సినేషన్‌ తరలించి వైద్యసిబ్బందికి వేయనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 8న డ్రైరన్‌ నిర్వహించిలో టుపాట్లను ఇప్పటికే బేరీజు వేశారు. వ్యాక్సిన్‌ కోసం ఎక్కడికి వెళ్లాలనే వారిపై ముందస్తుగా సెల్‌ఫోన్‌లకు సమాచారం రాగానే ఆ సెంటర్‌కు వెళ్లి వ్యాక్సినేషన్‌ వేయించుకోవడంతో పాటు వ్యాక్సినేషన్‌ అనంత రం అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండే ట్లు చర్యలు తీసుకోనున్నారు.
16 నుంచి వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌వో, కామారెడ్డి.
కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఈ నెల 16 నుంచి వేయనున్నాం. అందుకు అను గుణంగా జిల్లాలో 30 కేంద్రాలను, వ్యాక్సినేషన్‌ నిల్వలకు 26 కోల్డ్‌ స్టోరేజీ లను ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా 5,214 మంది తమ పేర్లను నమో దు చేసుకోగా వీరందరికీ నాలుగు రోజుల పాటు టీకాలు వేయనున్నాం. 28 రోజుల తర్వాత రెండో విడత టీకాను వేసేలా చర్యలు చేపడుతున్నాం. తొలిరోజు కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి, కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌నగర్‌ పీహెచ్‌సీ, ఎస్‌ఎస్‌నగర్‌, భిక్కనూర్‌ పీహెచ్‌సీలలో 30 నుంచి 50 మందికి వ్యాక్సిన్‌ను వేయనున్నాం.

Updated Date - 2021-01-14T05:39:37+05:30 IST