ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ఎప్పుడు...?

ABN , First Publish Date - 2022-07-03T03:54:31+05:30 IST

ప్రభుత్వ స్థలాలను ఆక్రమిం చుకొని గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకున్న నిరుపేదలకు చట్టబద్దత కల్పి స్తామని తెలంగాణ సర్కారు ప్రకటించడంతో పేదల్లో ఆశలు చిగురిస్తు న్నాయి. స్థలాలను క్రమబద్ధీకరించుకోవడం ద్వారా పలు రకాలుగా ప్రయోజనాలు పొందే అవకాశం ఉండటంతో దరఖాస్తుదారులు పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. దరఖాస్తుదారులు నివసిస్తున్న ఇళ్ల సర్వే పూర్తయి దాదాపు నాలుగు నెలలు గడుస్తోంది. నెల రోజుల్లో క్రమబద్ధీ కరణ చేస్తామని చెప్పిన అధికారులు మళ్లీ ఆ ప్రస్తావన తేకపోవడంతో దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు.

ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ఎప్పుడు...?

జిల్లాలో వేల సంఖ్యలో దరఖాస్తుదారులు 

నాలుగు నెలల కిందటే సర్వేలు పూర్తి

ముందుకు కదలని పట్టాల పంపిణీ ప్రక్రియ

విధివిధానాలు జారీ చేయడంలో ప్రభుత్వం జాప్యం

మంచిర్యాల, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్థలాలను ఆక్రమిం చుకొని గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకున్న నిరుపేదలకు చట్టబద్దత కల్పి స్తామని తెలంగాణ సర్కారు ప్రకటించడంతో పేదల్లో ఆశలు చిగురిస్తు న్నాయి. స్థలాలను క్రమబద్ధీకరించుకోవడం ద్వారా పలు రకాలుగా ప్రయోజనాలు పొందే అవకాశం ఉండటంతో దరఖాస్తుదారులు పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. దరఖాస్తుదారులు నివసిస్తున్న ఇళ్ల సర్వే  పూర్తయి దాదాపు నాలుగు నెలలు గడుస్తోంది. నెల రోజుల్లో క్రమబద్ధీ కరణ చేస్తామని చెప్పిన అధికారులు మళ్లీ ఆ ప్రస్తావన తేకపోవడంతో దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. సర్వే పూర్తయినం దున త్వరితగతిన పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు. క్రమబద్ధీకరణకు విధివిధానాలు జారీ చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో ఆ ప్రక్రియ ముందుకు కదలడం లేదు.  

క్రమబద్ధీకరణ రుసుం ఇలా...

ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు, ఇతర కట్టడాలు నిర్మించుకున్న వారికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం క్రమబద్ధీకరణకు దరఖాస్తులు ఆహ్వానిం చింది. ఇందులో భాగంగా 2014 జూన్‌ 2 నాటికి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టిన వారందరూ ఆధార్‌ కార్డు, నల్లా పన్ను, కరెంటు బిల్లులో ఏదైనా ఒక దానితో పాటు స్థలం తమ ఆధీ నంలో ఉన్నట్లు చూపించే ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే క్రమబద్ధీ కరిస్తామని ప్రభుత్వం ఫిబ్రవరి 14న ప్రకటించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన 58, 59 జీవోలకు అనుబంధంగా జీవో 14న విడుదల చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు 125 చదరపు గజాలలోపు స్థలాల్లో నిర్మించిన ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించనుండగా, 250 చదరపు గజాల లోపు ఉన్న వాటికి మార్కెట్‌ విలువలో 50 శాతం, 250-500 చదరపు గజాలలోని ఇళ్లకు 75 శాతం, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించిన కట్టడాలకు 100 శాతం రుసుము చెల్లించాలని ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. 

పేదల నుంచి స్పందన తక్కువే...

ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ పేదలు ముందుకు రాకపోకపోవడం గమనార్హం. క్రమబద్ధీకరణకు గతంలో విడుదల చేసిన 58, 59 జీవోలతోపాటు తాజా గా జారీ చేసిన జీవో 14పై వారికి అవగాహన లేకపోవడంతో క్రమబద్ధీ కరణకు ఆసక్తి చూపడం లేదు. విధివిధానాలపై అవగాహన కల్పించ డంలో అధికారులు విఫలమైనందునే దరఖాస్తు చేసేందుకు వారు ముందుకు రాలేదు. మొదట విడుదల చేసిన 58, 59 జీవోలకు సంబం ధించిన దరఖాస్తులు పెద్ద మొత్తంలో పెండింగులో ఉండటం, ప్రజలు ముందుకు రాకపోవడానికి కారణంగా తెలుస్తోంది.  నిర్ణీత ఫీజును సైతం ప్రభుత్వం సూచించిన విధంగా విడుతల వారీగా మీ సేవల ద్వారా చెల్లించారు. సంవత్సరాలు గడుస్తున్నా దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణ చేయకపోగా, డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో ప్రజల్లో అనాసక్తి నెలకొంది. ప్రస్తుతం జారీ చేసిన జీవో 14 సైతం అలాగే ఉంటుందనే భయంతో ప్రజలు ముందుకు రాలేదని తెలుస్తోంది. పైగా దరఖాస్తు చేసుకుంటే తమ భూముల వివరాలు అధికారులకు తెలిసి భవిష్యత్తులో స్వాధీనం చేసుకుంటారనే అపోహలతోనూ ప్రజలు వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ స్థలాలను పెద్ద మొత్తంలో ఆక్రమిం చుకున్న వారు మాత్రం జీవో జారీ అయిందే తడువుగా దరఖాస్తులు చేసుకున్నారు. 

జిల్లాలో దరఖాస్తులు ఇలా...

ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లకు క్రమబద్ధీకరణ కోసం జిల్లాలో 2827 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని 18 మండలాలకు సంబంధించి రెండు వేల పై చిలుకు దరఖాస్తులు రాగా ఒక్క నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోనే 1075 దరఖాస్తులు అందాయి. నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబరు 42లో పెద్ద ఎత్తున ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు ఉండగా, వాటిలో అధిక శాతం కబ్జాలకు గురయ్యాయి. అక్రమ నిర్మా ణాలు, కబ్జాల కారణంగా సుమారు రూ.50 కోట్లు విలువ చేసే భూము లు అన్యాక్రాంతం కాగా, 58, 59 జీవోల ద్వారా వాటిని క్రమబద్ధీకరిం చుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇక్కడి భూముల్లో 125 చదరపు గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్న పేద, మధ్య తరగతి ప్రజలను వేళ్లమీద లెక్కించవచ్చు. దరఖాస్తుదారుల్లో 10 గుంటలు మొదలు ఎకరాల కొద్దీ చేజిక్కించుకున్న బడాబాబులే అధికంగా ఉన్నారు. 500 పైబడి గజాల్లో నిర్మాణాలు చేపట్టిన వారికి 100 శాతం మార్కెట్‌ ఫీజు వసూలు చేస్తుండగా, ప్రభుత్వం నిర్ణయం వల్ల అప్పట్లో భూ కబ్జాలకు పాల్పడ్డ వారికి పెద్ద మొత్తంలో కలిసి రానుంది. మంచిర్యాల డివిజన్‌లో 2386 దరఖాస్తులు రాగా, బెల్లంపల్లి డివిజన్‌లో 441 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

Updated Date - 2022-07-03T03:54:31+05:30 IST