రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీ ఎపుడు?

ABN , First Publish Date - 2021-12-23T16:47:27+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2.50 లక్షల పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు..

రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీ ఎపుడు?

హైదరాబాద్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2.50 లక్షల పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. మనోహర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీ్‌పకుమార్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 27న ధర్నాచౌక్‌ వద్ద ఒకరోజు దీక్ష నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. బుధవారం వారు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు. 

Updated Date - 2021-12-23T16:47:27+05:30 IST