ltrScrptTheme3

పంజాబ్ సీఎం వ్యాఖ్యలపై సీఎం కేజ్రీవాల్ కౌంటర్

Oct 6 2021 @ 19:17PM

న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం వ్యాఖ్యలపై సీఎం కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కామెంట్స్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ మంచి దుస్తులు ధరించాలని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చాన్నీ కామెంట్స్ చేశారు. పంజాబ్ సీఎం వ్యాఖ్యలపై సీఎం కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. ఎన్నికల వాగ్దానాల గురించి ఆలోచించాలని చన్నీకి కేజ్రీవాల్ సూచించారు."బట్టల అంశాన్ని వదలండి, అని.. మీరు ఎన్నికల హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పండి?" అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. "మీకు తన బట్టలు నచ్చకపోయినా ఫర్వాలేదని, పబ్లిక్ వాటిని ఇష్టపడతారని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.