రాయచోటి మున్సిపాలిటీలో అభివృద్ధి ఎక్కడ?

ABN , First Publish Date - 2021-03-07T05:10:35+05:30 IST

రాయచోటి మున్సిపాలిటీలో 3 వేల కోట్లతో చేసిన అభివృద్ధి మీకు ఏమైనా కనిపిస్తా ఉందా అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీని వాసరెడ్డి ఓటర్లను అడి గారు.

రాయచోటి మున్సిపాలిటీలో అభివృద్ధి ఎక్కడ?
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి


రాయచోటి టౌన్‌, మార్చి 6: రాయచోటి మున్సిపాలిటీలో 3 వేల కోట్లతో చేసిన అభివృద్ధి మీకు ఏమైనా కనిపిస్తా ఉందా అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీని వాసరెడ్డి ఓటర్లను అడి గారు. శనివారం ఆయన 23, 24, 25 వార్డుల్లో టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ చేత శంకుస్థాపనలు కూడా చేయించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి జరిగిందో మీరే గమనించండి. రాయచోటి ఓటరు మహాశయులారా ఒక్కసారి ఆలోచించండి. మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసి ప్రజాస్వామ్యం బతికించండి అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గత ఏడాది మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల సందర్భంగా అధికార పార్టీ నాయకులు టీడీపీ అభ్యర్థులపై దాడి చేసి నామినేషన్‌ పత్రాలు చించి వేసి నీచ రాజకీయాలకు దిగజారారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు రెండు సంవత్సరాలుగా రాయచోటిలో ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో మున్సిపాలిటీ కంపు కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన టీడీపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, మాజీ జడ్పీటీసీ మల్లు నరసారెడ్డి, కడప కార్యాలయ కార్యదర్శి వెంకటశివారెడ్డి, నూలివీడు సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు పొట్లి వెంకట్రమణారెడ్డి, మాజీ సర్పంచ్‌ జిలానీబాషా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-07T05:10:35+05:30 IST