రష్యాకు గుడ్‌బై చెప్పిన బ్రాండ్లు ఇవే!

ABN , First Publish Date - 2022-03-11T22:38:11+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అనేక గ్లోబల్ బ్రాండ్స్ రష్యాలో తమ కార్యకలాపాలను రద్దు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రష్యా చేపట్టిన దాడుల్ని నిరసిస్తూ, అనేక కంపెనీలు రష్యాను వీడుతున్నాయి.

రష్యాకు గుడ్‌బై చెప్పిన బ్రాండ్లు ఇవే!

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అనేక గ్లోబల్ బ్రాండ్స్ రష్యాలో తమ కార్యకలాపాలను రద్దు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రష్యా చేపట్టిన దాడుల్ని నిరసిస్తూ, అనేక కంపెనీలు రష్యాను వీడుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు పూర్తిగా రష్యాను వీడగా, మరికొన్ని కంపెనీలు కూడా అదేబాట పడుతున్నాయి. ముఖ్యంగా అమెరికాతోపాటు యూరప్ బ్రాండ్లు, ఉక్రెయిన్‌కు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. కాగా, కొన్ని సంస్థలు మాత్రం రష్యాలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించాలనే నిర్ణయించాయి. రష్యాను వీడుతున్న బ్రాండ్లలో కోకాకోలా, పెప్సీ అండ్ కో, యాపిల్ వంటి సంస్థలున్నాయి.


ప్రముఖ బ్రాండ్లలో మెక్‌డొనాల్డ్స్ సంస్థ రష్యాను తాత్కాలికంగా వీడాలని నిర్ణయించింది. రష్యాలో ఆ సంస్థకు దాదాపు 850 స్టోర్లు ఉన్నాయి. వీటిని మూసివేయడం ద్వారా కంపెనీకి నెలకు యాభై మిలియన్ డాలర్ల వరకు నష్టం వస్తుందని అంచనా. మరో గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ కంపెనీ యమ్. అమెరికాకు చెందిన ఈ సంస్థకు కేఎఫ్‌సీ, పిజ్జా హట్, టాకోబెల్ వంటి అనేక బ్రాండ్లు ఉన్నాయి. వీటన్నింటినీ యమ్ కంపెనీ రష్యాలో నిలిపివేయనుంది. దీనివల్ల 1,000 వరకు కేఎఫ్‌సీ స్టోర్లు, 50కి పైగా పిజ్జా హట్ స్టో్ర్లు మూతపడనున్నాయి. ఇప్పటికే చైనాలో ఈ బ్రాండ్లు లేవు. మరోవైపు కోకాకోలా కంపెనీ కూడా ఉక్రెయిన్‌కు మద్దతుగా, రష్యాలో తమ వ్యాపారాల్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. సామ్‌సంగ్, యాపిల్, నైకి, మైక్రోసాఫ్ట్, టిక్‌టాక్, స్టార్‌బక్స్ వంటి సంస్థలు కూడా తమ కంపెనీల్ని రద్దు చేసుకున్నాయి. వీటితోపాటు టామీ హిల్‌ఫిగర్, ప్యూమా, మ్యాంగో, జారా, హెచ్ అండ్ ఎమ్, సెఫోరా వంటి బ్రాండ్లు కూడా మూతపడనున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ అయిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ కూడా రష్యాలో కార్యకలాపాల్ని నిలిపివేశాయి. ఫేస్‌బుక్ కూడా తన సేవల్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే.


గతంలో కూడా

యుద్ధ సమయంలో అనేక దేశాల్లో కంపెనీలు తమ సేవల్ని, వ్యాపార కార్యకలాపాల్ని రద్దు చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు చాలా కంపెనీలు ఇలా తమ సేవల్ని వివిధ దేశాల్లో నిలిపివేశాయి. ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనాలో తాము వ్యాపారం చేయబోమని ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ అయిన బెన్ అండ్ జెల్లీ ప్రకటించింది. అయితే, ఈ చర్యను అప్పటి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఆర్థిక తీవ్రవాదంగా అభివర్ణించారు. 

Updated Date - 2022-03-11T22:38:11+05:30 IST