ఏ మాస్కులు మేలు?

ABN , First Publish Date - 2020-11-03T16:32:29+05:30 IST

మెడికల్‌ షాపులతో పాటు టైలర్‌ షాపుల్లో, దుస్తుల దుకాణాల్లో... ఇలా ప్రతి చోట వేర్వేరు మెటీరియల్స్‌తో తయారైన మాస్కులు అమ్ముడవుతున్నాయి. వేర్వేరు మెటీరియల్స్‌తో తయారయ్యే

ఏ మాస్కులు మేలు?

ఆంధ్రజ్యోతి(03-11-2020)

మెడికల్‌ షాపులతో పాటు టైలర్‌ షాపుల్లో, దుస్తుల దుకాణాల్లో... ఇలా ప్రతి చోట వేర్వేరు మెటీరియల్స్‌తో తయారైన మాస్కులు అమ్ముడవుతున్నాయి. వేర్వేరు మెటీరియల్స్‌తో తయారయ్యే ఈ మాస్కుల సామర్ధ్యం గురించి జరిపిన ఓ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.


టీ షర్ట్‌ల నుంచి సాక్స్‌, జీన్స్‌, వ్యాక్యూమ్‌ బ్యాగ వరకూ... ఇవన్నీ వేర్వేరు వస్త్రాలతో తయారవుతాయి. అలాంటి వాటికి ఉపయోగించే మెటీరియల్స్‌తో చేసిన మాస్కులను చాలామంది ఉపయోగిస్తున్నారు కూడా. అయితే వాటిలో ఏది సమర్థంగా కరోనా వైరస్‌ను అడ్డుకోగలదనేది చాలామందికి కలిగే ప్రశ్న. దానికి సమాధానం కనుక్కొనే ప్రయత్నం చేసింది కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ పరిశోధక బృందం. పార్టికల్స్‌ స్వల్పంగా ఎగసిపడే వీలుండే మాస్కుల మీద మాత్రమే ఇప్పటి వరకూ అధ్యయనాలు జరిగాయి. కానీ మాస్కు ధరించిన వ్యక్తి బలంగా దగ్గినా, శ్వాస వదిలినా వైరస్‌ను ఆయా మాస్కులు సమర్థంగా అడ్డుకోగలవా? అనే కోణంలో పరిశోధనలు ఇప్పటివరకూ జరగలేదు. ఈ కోణంలో సాధారణ సర్జికల్‌ మాస్కులతో పాటు ఎన్‌95ను కూడా కేంబ్రిడ్జి బృందం పరిశీలించింది. 


నాన్‌ క్లినికల్‌ మాస్కులు మేలే, కానీ...

నాన్‌ క్లినికల్‌ మాస్కులన్నీ అలా్ట్రఫైన్‌ (సూక్ష్మమైన) పార్టికల్స్‌ను సమర్థంగానే వడబోస్తాయని ఈ అధ్యయనంలో తేలింది. అయితే అన్నిటికంటే ఎన్‌95 అత్యంత సమర్థమైనదనీ, హెపా వ్యాక్యూమ్‌ బ్యాగ్‌ మెటీరియల్‌ ఎన్‌95 కంటే మరింత మెరుగైనదని పరిశోధకులు కనుగొన్నారు.


రెండు పనులూ సమర్థంగా...

ఇంటి వద్ద తయారుచేసుకునే మూడు పొరల ఫాబ్రిక్‌ మాస్కులు కూడా సమర్థమైనవే! కానీ వాటి పొరల మధ్య చొక్కా కాలర్ల బిగుతుదనానికి వాడే మెటీరియల్‌ను ఉపయోగిస్తే మరింత మెరుగ్గా వైరస్‌ను అడ్డుకోగలుగుతాయని తేలింది. అయితే, ఇలాంటి మాస్క్‌ ధరిస్తే, ఎన్‌95 మాస్క్‌ వేసుకున్నప్పటికన్నా బలంగా ఊపిరి పీల్చుకోవలసి వస్తుంది. అలాగే వీటిని పదే పదే ఉతికి వాడడం వల్ల వాటి సామర్థ్యం తగ్గే అవకాశాలూ ఉంటాయి.  జీన్స్‌ వస్త్రం అన్నిటికంటే సమర్థంగా కరోనా వైరస్‌ను వడగట్టగలదు. అయితే ఈ రకం మాస్క్‌తో శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుంది. సింగిల్‌ యూజ్‌, రీయూజబుల్‌ వాక్యూమ్‌ బ్యాగ్స్‌ మెటీరియల్‌తో తయారైన మాస్కులను కూడా ఈ బృందం పరిశీలించింది. ఇలా తయారైన మాస్కులు సమర్థంగానే పనిచేసినా, పొరపాటున చిరిగితే వాటిలోని పార్టికల్స్‌ శ్వాసతో ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంటుందని తేల్చింది.


మెరుగైన మాస్క్‌ల కోసమే!

మాస్కుల తయారీదారులకుమార్గదర్శకంగా నిలవడం కోసం.. అటు వైరస్‌లను వడగట్టగలుగుతూ, ఇటు శ్వాస తేలికగా పీల్చుకునే వీలుండే వేర్వేరు మెటీరియల్స్‌ గురించి పరిశోధనలు జరుపుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. అంతిమంగా మూడు పొరల వస్త్రాలతో తయారయ్యే మాస్కులు, ఎన్‌95 మాస్కులతో సమానమైన సామర్థ్యంతో వైరస్‌ను అడ్డుకోగలవని పరిశోధకులు నిర్ధారించారు.

Updated Date - 2020-11-03T16:32:29+05:30 IST