నరాల బలహీనత తగ్గాలంతే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ABN , First Publish Date - 2021-12-17T18:44:13+05:30 IST

దీర్ఘకాలిక తలనొప్పి, కండరాలు బలం కోల్పోవడం, కొంత స్పర్శ కోల్పోవడం, దృష్టిమార్పులు, జ్ఞాపకశక్తి తగ్గడం

నరాల బలహీనత తగ్గాలంతే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ఆంధ్రజ్యోతి(17-12-2021)

ప్రశ్న: నాకు డెబ్భై ఏళ్లు. నరాల బలహీనత వుంది. ఎలాంటి ఆహారం నాకు మంచిది? 


- శ్రీనివాస్‌, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: దీర్ఘకాలిక తలనొప్పి, కండరాలు బలం కోల్పోవడం, కొంత స్పర్శ కోల్పోవడం, దృష్టిమార్పులు, జ్ఞాపకశక్తి తగ్గడం, సమన్వయం మందగించడం మొదలైనవన్నీ నరాల బలహీనత లక్షణాలు. మెదడు, నరాల ఆరోగ్యం కోసం ఆహారంలో కొన్ని పోషకాలు తప్పనిసరి. ఒమేగా-3 ఫాటీయాసిడ్స్‌ అధికంగా ఉండే చేపలు, అవిసెగింజలు, ఆక్రోట్‌ గింజలు  రోజూ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్‌, పాలీఫీనాల్స్‌ అనే పదార్థాలుండే ముదురు రంగుల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు నరాల ఆరోగ్యానికి మంచిది. రోజూ 150-200 గ్రాముల పండ్లు, 200 గ్రాముల కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. పసుపులోని కర్క్యుమిన్‌, గ్రీన్‌ టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ కూడా నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అధికంగా ప్రాసెస్‌ చేసిన ఆహారం, వేపుళ్ళు, నూనెలో వేయించిన ఆహారం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, చక్కెర, స్వీట్లు, తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇవన్నీ నరాల ఆరోగ్యానికి హానికరం. ఆహార జాగ్రత్తలతో పాటు ఎంతో కొంత వ్యాయామం చేయడం వల్ల కూడా నరాల బలహీనత తగ్గి ఓపిక చేకూరుతుంది. ఒత్తిడి తగ్గించుకొని, మానసిక ఆందోళనలకు దూరంగా ఉండడం, తగినంత నిద్రపోవడం మంచిది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు) 

Updated Date - 2021-12-17T18:44:13+05:30 IST