స్పాండిలైటిస్‌తో బాధపడే వారు ఈ ఆహారం తీసుకుంటే..?

ABN , First Publish Date - 2021-03-06T20:09:10+05:30 IST

ఎముకల ఆరోగ్యానికి, దృఢత్వానికి కాల్షియం, విటమిన్‌ - డి చాలా అవసరం. ఈ రెంటితో పాటు మాంసకృత్తులు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌- కె కూడా ఎముకల నిర్మాణానికి, ఎముకలు పెళుసు బారకుండా ఉండడానికి తోడ్పడతాయి.

స్పాండిలైటిస్‌తో బాధపడే వారు ఈ ఆహారం తీసుకుంటే..?

ఆంధ్రజ్యోతి(06-03-2021)

ప్రశ్న: స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నాను. కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకొమ్మని వైద్యుల సలహా. ఏ ఆహారం తీసుకోవాలి?


- శ్రీరమాదేవి, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: ఎముకల ఆరోగ్యానికి, దృఢత్వానికి కాల్షియం, విటమిన్‌ - డి చాలా అవసరం. ఈ రెంటితో పాటు మాంసకృత్తులు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌- కె కూడా ఎముకల నిర్మాణానికి, ఎముకలు పెళుసు బారకుండా ఉండడానికి తోడ్పడతాయి. పాలు, పెరుగు ముఖ్యమైన కాల్షియం, ఫాస్ఫరస్‌ను అందిస్తాయి. కొన్ని రకాల ఆకుకూరల్లో కూడా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. పప్పు ధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తుల నుంచి మాంసకృత్తులు లభిస్తాయి. విటమిన్‌ - డి సూర్యరశ్మి వల్ల లభిస్తుంది. అలాగే విటమిన్‌- డితో ఫోర్టిఫై చేసిన పాలను తీసుకోవడం వల్ల కాల్షియం, విటమిన్‌- డి రెండూ లభిస్తాయి. ఇలా అన్ని రకాల కూరలు, పళ్ళు, ఆకుకూరలు, పాలు, పెరుగులతో ఉన్న సమతులాహారం తీసుకుంటే ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. ఎక్కువ మోతాదులో ఉప్పు, కూల్‌డ్రింక్స్‌, మాంసాహారం, కాఫీ తీసుకోవడం; ధూమపానం చేయడం; శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం వల్ల ఎముకలు పెళుసు బారే అవకాశం ఉంది. కాబట్టి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు ఏదో ఓ వ్యాయామాన్ని అలవరచుకోవాలి. 


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-03-06T20:09:10+05:30 IST