Jaggery Vs Sugar: బెల్లం, చక్కెరలో ఏది ఆరోగ్యానికి మంచిది.. ఏది ఎక్కువగా వాడుతున్నారు.

ABN , First Publish Date - 2022-09-09T18:45:55+05:30 IST

పండుగలు, ఫంక్షన్స్ లకు స్వీట్స్ లేకుంటే ఆ వెలితి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

Jaggery Vs Sugar: బెల్లం, చక్కెరలో ఏది ఆరోగ్యానికి మంచిది.. ఏది ఎక్కువగా వాడుతున్నారు.

మన పెద్దల నుంచి వస్తున్న కొన్ని ఆహారపు అలవాట్లలో తీపికి సంబంధించి బెల్లం ముఖ్యంగా వాడుతున్నాం. అప్పటికి ఇప్పటికి మనం తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఇతర పదార్థాలలో అన్ని వయసుల వారికీ నచ్చే పదార్థం తీపి. తీపిని ఇష్టంపడని వారంటూ ఉండరు. స్వీట్స్ విషయానికి వస్తే అందరికీ ఇవి అమితమైన ఇష్టం. పండుగలు, ఫంక్షన్స్ లకు స్వీట్స్ లేకుంటే ఆ వెలితి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే చక్కెర వ్యాధి ఉన్నవారు చాక్లెట్ తినకూడని వాటిలో స్వీట్స్ ముందువరసలో ఉంటాయి. మరి చక్కెర ఉపయోగించకుండా బెల్లంతో స్వీట్స్, చాక్లెట్లను తయారు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. 


చక్కెర తీసుకుంటున్నారా?

చక్కెర తీసుకోవడం తాత్కాలిక ఎనర్జీ శరీరానికి చాలానే అందుతుంది. కానీ వెంటనే వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది శక్తి కోల్పోతారు. దీనివల్ల అలసట, నీరసం, బద్ధకం, ఏకాగ్రత కోల్పోవడం సమస్యలు వస్తాయి. చక్కెర రోగనిరోధక శక్తిపైనా ప్రభావం చూపుతుంది. తరచుగా జబ్బు పడటం, బ్యాక్టీయా, వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే కనుక వెంటనే పంచదారను దూరంపెట్టడం మంచిది.


అసలు బెల్లం ప్రయోజనాలేంటి?

బెల్లంలో మైనో ఆమ్లాలు, ఫినాలిక్లు, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, విటమిన్లు వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వల్ల, బెల్లాన్ని ఒక న్యూట్రాస్యూటికల్‌గా తీసుకుంటున్నాం. బెల్లంలో కేలరీస్ తక్కువగా ఉండటం వల్ల బెల్లంతో చేసిన పదార్థాలు తినేప్పుడు బరువు పెరగరు. అంతే కాదు ఇది ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఇది జీర్ణ క్రియను మేలు చేస్తుంది.


రోజూ బెల్లం తింటే..

రోజు బెల్లం తినడం వలన లివర్ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ లో ఉండే బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. బెల్లంలో ఉండే పొటాషియం శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ గా ఉండేందుకు సహకరిస్తుంది. కండరాలను బలంగా మారుస్తుంది. 


రక్తాన్ని సుద్ది చేస్తుంది..

రక్తాన్ని సుద్ది చేయడంలో బెల్లం సహకరిస్తుంది. శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతాయి. 


మోకాళ్ళు, మోచేతులు నొప్పులు పోతాయి..

మోకాళ్ళు, మోచేతులు నొప్పులను బెల్లం తినడంతో పోగొట్టవచ్చు. పాలలో బెల్లం, అల్లం రసం కలుపుకుని త్రాగితే తప్పకుండా నొప్పులు పోతాయి. శరీరం కూడా దృఢంగా మారుతుంది.

Updated Date - 2022-09-09T18:45:55+05:30 IST