
ఆంధ్రజ్యోతి(29-03-2022)
దాహం వేసినప్పుడు నీళ్లు తప్పనిసరిగా తాగవలసిందే! అయితే రోజు మొత్తంలోని కొన్ని సమయాల్లో నీళ్లు తాగడం ద్వారా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకునే వీలుంది. ఆ సమయాలు ఏవంటే...
ఉదయం నిద్ర లేచిన వెంటనే: పరగడుపున ఒక గ్లాసు నీళ్లు తాగడం ద్వారా అంతర్గత అవయవాలు శుభ్రపడతాయి.
భోజనానికి ముందు: ఆకలి తగ్గుతుంది. జీర్ణ రసాలు పలుచనై అసిడిటీ బాధ తప్పుతుంది.
స్నానానికి ముందు: స్నానానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది.
నిద్రకు ముందు: డీహైడ్రేషన్‌కు గురి కాకుండా నిద్రకు ముందు గ్లాసు నీళ్లు తాగాలి.