శభాష్ సులోచన.. మహిళా కానిస్టేబుల్‌పై అభినందనల వర్షం

Sep 28 2021 @ 12:33PM

భిల్వారా(రాజస్థాన్): ఆర్‌పీఎఫ్ మహిళా కానిస్టేబుల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నీళ్లకోసం కిందకు దిగిన ఓ మహిళ కదులుతున్న రైల్ ఎక్కేందుకు ప్రయత్నించి కిందపడిపోయింది. మహిళా కానిస్టేబుల్ సమయానికి ఆమెను పక్కకు లాగడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. 


రాజస్థాన్‌లోని భిల్వారా రైల్వే స్టేషన్‌కు ఇండోర్ నుంచి జోధ్‌పూర్ వెళ్లే రైలు వచ్చింది. అందులో నుంచి ఓ మహిళ నీళ్ల కోసం కిందకు దిగింది. నీళ్లు పట్టుకోకముందే రైలు కదలడం గమనించి కంగారుపడింది. కదులుతున్న రైలు ఎక్కడం కోసం ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. సమయానికి అక్కడే ఓ మహిళా కానిస్టేబుల్ ఉండడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కిందపడిన మహిళను వెంటనే పక్కకు లాగడంతో ఆమె ప్రాణాలతో గట్టెక్కింది. లేదంటే ఘోరం జరిగిపోయేదే. 


ఆ మహిళా కానిస్టేబుల్ పేరు సులోచన అని తెలిసింది. ఓ మహిళ ప్రాణాలను కాపాడిన సులోచనను ప్రయాణికులు, రైల్వే అధికారులు అభినందించారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. సీసీ కెమెరాలో రికార్డైన ఈ వీడియోను రైల్వే అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. మహిళా కానిస్టేబుల్ సులోచపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.