మరుగుదొడ్డి కోసం గుంత తవ్వుతుండగా... మధ్యలో ఊహించని దృశ్యంతో కళ్లు జిగేల్.. చివరకు..

Published: Fri, 19 Aug 2022 19:55:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మరుగుదొడ్డి కోసం గుంత తవ్వుతుండగా... మధ్యలో ఊహించని దృశ్యంతో కళ్లు జిగేల్.. చివరకు..

గుప్త నిధుల (hidden treasures) కోసం కొందరు అక్రమంగా తవ్వకాలు చేస్తుంటారు. కొందరైతే పురాతన ఆలయాలను.. నిధుల పేరుతో కూల్చేయడం చూస్తూనే ఉన్నాం. పురతాన కాలంలో విలువైన ఆభరాణాలు, నగలు తదితరాలను దొంగల బారి నుంచి రక్షించుకునేందుకు భూమిలో పాతిపెడుతుంటారు. తవ్వకాలు జరిగే సమయంలో కొన్నిసార్లు నిధులు బయటపడ్డాయనే వార్తలు వింటూ ఉంటాం. కంబోడియా ప్రావిన్స్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కొడుకుతో కలిసి మరుగుదొడ్డి కోసం గుంతను తవ్వుతున్నారు. మధ్యలో ఒక్కసారిగా వారి కళ్లు జిగేల్‌మని మెరిశాయి. చివరకు ఏం జరిగిందంటే..

మరుగుదొడ్డి కోసం గుంత తవ్వుతుండగా... మధ్యలో ఊహించని దృశ్యంతో కళ్లు జిగేల్.. చివరకు..

కాంబోడియా ప్రావిన్స్‌ (Province of Cambodia) వాయువ్య ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతంలో సబోయున్ రాన్ అనే 42 ఏళ్ల వ్యక్తి.. మరుగుదొడ్డి కోసం కొడుకుతో కలిసి గుంత తవ్వుతున్నాడు. రెండు మీటర్లు తవ్వగానే వారికి నీలి రంగులో రాయి కనిపించింది. దీంతో ఒక్కసారిగా వారు షాక్ అయ్యారు. మరింత తవ్వగా మొత్తం నాలుగు విగ్రహాలు (idols) బయటపడ్డాయి. అవి పురాతన కాంస్య విగ్రహాలుగా గుర్తించారు. ఈ వార్త అందరికీ తెలిసిపోవడంతో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన పురావస్తు శాస్త్రవేత్తలు.. ఆ విగ్రహాలు 10వ లేదా 11వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు. వాటిని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Viral Video: ఓ వైపు వర్షం.. మరో వైపు వరద.. మధ్యలో నడి రోడ్డుపై ఈ పెద్దాయన ఏం చేస్తున్నాడో చూడండి..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Facebook post: ప్రియురాలితో దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన యువకుడు.. మరుసటి రోజే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు.. Wife Killed Husband: భర్తను చంపి బాత్రూంలోనే మృతదేహాన్ని రెండ్రోజుల పాటు దాచిన భార్య.. వాసన వస్తోందని ఆమె చేసిన పనితో..Attack on girl: ఆలయం నుంచి వస్తున్న బాలిక వెనుకే వెళ్లాడు.. మర్కెట్ దగ్గరికి రాగానే వెనుక వైపు నుంచి ఒక్కసారిగా..ఆరు నెలల క్రితం అస్వస్థతకు గురైన భర్త.. ఇటీవల చెల్లెలి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన భార్య.. చివరకు చేసిన పని.. గ్రామం ఖాళీ చేసిన యువకుడి కుటుంబం.. విషయం తెలిసి వీడియో రిలీజ్ చేసిన యువతి.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..పిల్లలను ఇంట్లో వదిలి అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లి.. చివరకు భార్య గదిలో అతడు చేసిన దారుణం..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.