పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం సర్పంచ్‌లపై కొరడా

ABN , First Publish Date - 2021-07-27T06:31:03+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో అధికారులతోపాటు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసింది. ఈ నెల 1నుంచి 10 తేదీ వరకు నిర్వహించిన పల్లెప్రగతిలోగ్రామాల్లో సమస్యలు గుర్తించి వాటిని 10రోజుల వ్యవధిలో పరిష్కరించాల్సి ఉంది.

పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం సర్పంచ్‌లపై కొరడా

21 మందికి షోకాజ్‌ నోటీస్‌

ఏడుగురు కార్యదర్శులకు కూడా


సూర్యాపేట సిటీ, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో అధికారులతోపాటు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసింది. ఈ నెల 1నుంచి 10 తేదీ వరకు నిర్వహించిన పల్లెప్రగతిలోగ్రామాల్లో సమస్యలు గుర్తించి వాటిని 10రోజుల వ్యవధిలో పరిష్కరించాల్సి ఉంది. అయితే కొంతమంది సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యం వహించా రు. దీంతో గ్రామాల్లో పారిశుధ్య లోపం, మురుగు గుంతలను పూడ్చకపోవడం, హరితహారం మొక్కలు నాటడంలో నిర్లక్ష్యం వహించిన 21 మంది సర్పంచ్‌లకు, ఏడుగురు కార్యదర్శులకు పంచాయతీరాజ్‌శాఖ జిల్లా అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.జిల్లా ఏర్పడిన నా టి నుంచి ఒకేసారి 21మందికి షోకాజ్‌ జారీ చేయడం చర్చనీయాంశమైంది. కాగా,నోటీసులు జారీ చే సి 10రోజులై నా ఇప్పటి వరకు ఒక్క సర్పంచ్‌ కూడా జిల్లా పంచాయతీ అధికారికి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.


ఆ మండలంలో అత్యధికంగా..

పల్లెప్రగతి కార్యక్రమంపై నిర్లక్ష్యం చేశారని జిల్లా పంచాయతీ రాజ్‌ అఽధికారుల నుంచి షోకాజ్‌ నోటీసులు పొందిన సర్పంచుల్లో ఎక్కువ మంది ఆత్మకూర్‌(ఎస్‌) మండలానికి చెందినవారే ఉన్నారు. ఈ మండలంలో అత్యధికంగా తొమ్మిది మంది సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు అందాయి. షోకాజ్‌ అందుకున్నవారిలో ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని కోటినాయక్‌తండా, ఆత్మకూర్‌(ఎస్‌), మిడతనపల్లి, మక్తాకొత్తగూడెం, ఏనుబాముల, పాతర్లపహాడ్‌, తుమ్మలపెన్‌పహాడ్‌, ఏపూర్‌తండా, దుబ్బాతండా, అనంతగిరి మండలంలో వాయిల సింగారం, చింతలపాలెం మండలంలోని చింతపాలెం గ్రామ సర్పంచ్‌ ఉన్నారు. అదేవిధంగా చివ్వెంల మండలంలోని పిల్లలజగ్గుతండా, మఠంపల్లి మండలంలో వరదాపురం, మచ్యాతండా, నడిగూడెం మండల కేంద్రం, కర్విరాల, నాగారం మండలంలోని మాచిరెడ్డిపల్లి, పాలకవీడు మండలంలోని రఘనాఽథపాలెం, పెన్‌పహాడ్‌ మండలంలోని చెట్లముకుందాపురం, సూర్యాపేట మండలంలోని పిన్నాయిపాలెం, కేసారం గ్రామాల సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు అందాయి.


పంచాయతీ కార్యదర్శులకు సైతం

పల్లెప్రగతి కార్యక్రమంలో నిర్లక్ష్యం చేశారనే కారణంతో పంచాయతీ కార్యదర్శులపై సైతం అధికారులు వేటు వేశారు. పల్లెప్రగతి కార్యక్రమం రోజుల్లో మొక్కుబడిగా గ్రామాలకు వెళ్లి పూర్తి సమయం ఉండకుండా ఇంటికి వెళ్లారన్న ఆరోపణలు కార్యదర్శులపై వచ్చాయి. కొంతమంది కార్యదర్శులు సర్పంచ్‌లతో కలిసిపోయి పల్లెప్రగతి కార్యక్రమంలో గుర్తించిన పనులను పూర్తి చేయకముందే చేసినట్టు రిజిష్టర్‌లో నమోదు చేశారని అధికారులు గుర్తించారు. దీంతో ఏడుగురు కార్యదర్శులకు అధికారులు షోకాజ్‌ నోటీసులను జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో హుజూర్‌నగర్‌ మండలంలోని బుర్గంపహాడ్‌, చింతలపాలెం మండలంలోని ఎర్రకుంటతండా, మోతె మండలంలోని సిరికొండ, విభాళాపురం, పెన్‌పహాడ్‌ మండలంలోని ఎన్‌.అన్నారం, సింగిరెడ్డిపాలెం, మునగాల మండలంలోని ఆకుపాముల కార్యదర్శులు ఉన్నారు. నోటీసులు అందుకున్నవారు నేటికీ సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.


‘పల్లెప్రగతి’పై ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం

పల్లెప్రగతి కార్యక్రమంపై కొంతమంది సర్పంచ్‌లు నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆయా గ్రామాల్లో మౌలిక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. పల్లెప్రగతి కార్యక్రమంలో గుర్తించిన సమస్యలపై ఆసక్తి చూపలేదు. అయితే పల్లెప్రగతి కార్యక్రమం అనంతరం అధికారులు గ్రామాల్లో పర్యటించారు. ప్రగతి పనులను పరిశీలించి గ్రామాల్లో అభివృద్ధి పనులపై జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు. అంతేగాక నిర్లక్ష్యం చూపిన ప్రజాప్రతినిధుల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేయకపోవడం, వీధుల వెంట పిచ్చి మొక్కలను తొలగించకపోవడం, కొత్త డ్రైనేజీలు నిర్మించకపోవడం, మంచి నీటి సరఫరా పైపులు ధ్వంసమైనా పట్టించుకోకపోవడం తదితరకారణాలతో జిల్లాలో 21మంది పంచాయతీ సర్పంచ్‌లకు, ఏడుగురు కార్యదర్శులకు పంచాయతీరాజ్‌శాఖ జిల్లా అధికారి షోకాజ్‌ నోటీసులు పంపారు. అంతేగాక హరితహారం, వైకుంఠఽధామల నిర్మాణ పనులు, డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలను గడువులోగా పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చూపిన వారికిసైతం అధికారులు షోకాజ్‌ జారీచేశారు.


Updated Date - 2021-07-27T06:31:03+05:30 IST