ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా

ABN , First Publish Date - 2021-04-23T05:18:05+05:30 IST

కడప నగరంలో కరోనా చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా డి పాజిట్‌ వసూలు చేసిన రెండు ప్రైవేటు ఆసుపత్రులపై కలెక్టర్‌ హరికిరణ్‌ కొరడా ఝుళిపించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు, డిపాజిట్లు వసూలు చేసిన రెండు ఆసుపత్రులకు ఒక్కో దానికి రూ.5లక్షల చొప్పున అపరాధ రుసుం విఽధించారు.

ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా
కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్స తీసుకుంటున్న రోగితో మాట్లాడుతున్న జేసీ సాయికాంతవర్మ

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

అఽధిక ఫీజులు వసూలు చేసినందుకు రెండు ఆసుపత్రులపై చర్యలు

ఒక్కో ఆసుపత్రికి రూ.5 లక్షలు విధింపు

నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్‌ చర్యలు, ఆసుపత్రి లైసెన్సు రద్దు

కలెక్టరు హరికిరణ్‌

కడప, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): కడప నగరంలో కరోనా చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా డి పాజిట్‌ వసూలు చేసిన రెండు ప్రైవేటు ఆసుపత్రులపై కలెక్టర్‌ హరికిరణ్‌ కొరడా ఝుళిపించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు, డిపాజిట్లు వసూలు చేసిన రెండు ఆసుపత్రులకు ఒక్కో దానికి రూ.5లక్షల చొప్పున అపరాధ రుసుం విఽధించారు. నిబంధనలను అతిక్రమించి ఎక్కువ వసూలు చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదుతో పాటు ఆసుపత్రుల లైసెన్సు రద్దు చేస్తామని కలెక్టరు హెచ్చరించారు. గురువారం ఆంరఽధజ్యోతిలో ‘ప్రైవే టు దందా’ పేరిట ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పేరుతో జరుగుతున్న దోపిడీపై కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కలెక్టర్‌ తనిఖీల కోసం జేసీ (అబివృద్ధి) సాయికాంతవర్మను పంపించారు. ఆయన కడపలో కొవిడ్‌ చికిత్స అందిస్తున్న రెండు ఆసుపత్రులను పీపీఈ కిట్లు ధరించి తనిఖీ చేశారు. కొవిడ్‌ పేషంట్లతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద జాయిన అయిన కొవిడ్‌ పేషంట్ల నుంచి లక్ష రూపాయలతో పాటు మరో రూ.55వేలు మందుల ఖర్చు కింద వసూలు చేసినట్లు వారు జేసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పేషంట్ల తాలుకూ సహాయకుల నుంచి వాంగ్మూలం తీసుకుని కలెక్టర్‌కు నివేదించడంతో ఒక్కో ఆసుపత్రికి రూ.5 లక్షలు చొప్పున జరిమానా విధించారు.


50 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాల్సిందే..

కలెక్టరేట్‌లోని తన చాంబరులో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కొవిడ్‌ వైద్యసేవల నిర్వహణపై కలెక్టర్‌ సీహెచ హరికిరణ్‌ మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ద్వారా అడ్మిట్‌ అయ్యే వారికి మెరుగైన సేవలందించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు కొవిడ్‌ చికిత్సకు అనుమతించే రోజు ఆరోగ్యశ్రీ ద్వారా 50 శాతం బెడ్లు కేటాయించేలా నిబంధనలు విధించామన్నారు. అయితే ఆ నిబంధన గాలికొదిలి పేషంట్ల వద్ద అధిక ఫీజులు తీసుకోవడంతో చర్యలు తీసుకున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా అడ్మిట్‌ అయ్యే ఏ పేషంటు వద్ద రూపాయి కూడా వసూలు చేయవద్దని, అలా నిబంధనలు అతిక్రమిస్తే డిజాస్టర్‌ మేనేజ్‌మెంటు చట్టం - 2005 మేరకు సంబంధిత ఆసుపత్రుల యజమానులపై క్రిమినల్‌ కేసులు, చట్టపరంగా శిక్షలు అమలు చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా కొవిడ్‌ వైద్యం అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల్లోని రిసెప్షన కౌంటరు వద్దనే కొవిడ్‌ వైద్యసేవల సలహాలు, సహాయం కోసం ప్రత్యేక ఐసోలేషన ఏర్పాటు చేయాలని సూచించారు. నోడల్‌ అధికారులు వారికి కేటాయించిన ఆసుపత్రుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు పర్యటించాలన్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు అందుబాటులో ఉంచుకుని పేషంటును అడ్మిట్‌ చేసే బాధ్యత వారిదేనన్నారు. ఎంపిక చేసిన ఆసుపత్రులన్నింటిలో అన్ని బెడ్లు కనిపించేలా సీసీ కెమెరాలు అమర్చాలన్నారు. ఫీజు వివరాలను, బెడ్లు ఖాళీ అయిన వివరాలు తెలిపే బోర్డులు హెల్ప్‌ డెస్క్‌ వద్ద అందరికీ కనిపించేలా చేయాలన్నారు. ఏ ఆసుపత్రుల్లో ఎంతమేర రెమిడిసివిర్‌ స్టాకు ఉందో రోజూ డేటా తెలపాలన్నారు. అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచుకోవడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన ధరకే అందించాలన్నారు. కార్యక్రమంలో జేసీ సాయికాంతవర్మ, వీఆర్వో మలోలా, ఎస్‌ఎ్‌సఏ పీవో ప్రభాకర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ఇనచార్జ్‌ జేడీ రాధాదేవి, ప్రైవేటు ఆసుపత్రుల నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T05:18:05+05:30 IST