కొరడా దెబ్బలు కొట్టించుకున్న సీఎం

ABN , First Publish Date - 2020-11-16T00:49:21+05:30 IST

ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాలంటేనే సామాన్యులకు ఎంతో కష్టం. అలాంటిది ఓ పెద్దాయన కొరడా తీసుకుని...

కొరడా దెబ్బలు కొట్టించుకున్న సీఎం

రాయ్‌పూర్‌: ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాలంటేనే సామాన్యులకు ఎంతో కష్టం. అలాంటిది ఓ పెద్దాయన కొరడా తీసుకుని ఆ రాష్ట్ర సీఎంను ఎడా పెడా కొట్టేశాడు. అయితే అన్ని దెబ్బలు తింటున్నా.. ముఖ్యమంత్రి మాత్రం నవ్వుతూ ఉన్నారు. పక్కన వారు ఆపడం మానేసి.. కళ్లప్పగించి చూస్తున్నారు, కెమెరాలు, మోబైల్ ఫోన్లలో ఫోటోలు తీసుకుంటున్నారు కానీ.. ఎవరూ ఆపలేదు. అదేంటి.. సీఎంను కొరడాతో కొడుతున్నా ఎవరూ ఏమీ అనకపోవడం ఏంటి..? అని ఆలోచిస్తున్నారా..? ఎందుకంటే అది అక్కడి సంప్రదాయం. రాష్ట్రం సౌభాగ్యంతో తులతూగాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వయానా ముఖ్యమంత్రి ఇలా కొరడా దెబ్బలు కొట్టించుకుంటారు.


ఛత్తీస్‌ఘడ్‌లో ఉందీ సంప్రదాయం. దుర్గ్‌ జిల్లా, జజంగిర్‌ గ్రామంలో ప్రతి ఏటా గోవర్ధన్ పూజ వైభవంగా నిర్వహిస్తారు. ఈ పూజలో రాష్ట్ర సీఎం స్వయంగా పాల్గొంటారు. ఈ ఏడాది జరిగిన పూజలో సీఎం భూపేశ్‌ బఘేల్‌ పాల్గొన్నారు. సంప్రదాయం ప్రకారం ఆయన కూడా చేతిపై కొరడాతో దాదాపు పది వరకు కొట్టించుకున్నారు. 

Updated Date - 2020-11-16T00:49:21+05:30 IST