పాతికేళ్లుగా గొంతులో విజిల్.. ఇప్పుడు ఆపరేషన్

ABN , First Publish Date - 2021-02-18T18:23:32+05:30 IST

పాతికేళ్లుగా గొంతులో విజిల్ ఇరుక్కుపోయి బాధపడుతున్న ఓ మహిళకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. కేరళ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేసి ఆ విజిల్‌ను బయట..

పాతికేళ్లుగా గొంతులో విజిల్.. ఇప్పుడు ఆపరేషన్

కొచ్చి: పాతికేళ్లుగా గొంతులో విజిల్ ఇరుక్కుపోయి బాధపడుతున్న ఓ మహిళకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. కేరళ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేసి ఆ విజిల్‌ను బయటకు తీశారు. 25 ఏళ్ల క్రితం స్నేహితులతో ఆడుకుంటూ అనుకోకుండా చిన్న విజిల్‌ను ఆమె మింగేసింది. అయితే ఆ విషయాన్ని ఆమె గమనించలేదు. కానీ అప్పటి నుంచి ఆమెకు తీవ్రమైన దగ్గు వస్తూ ఉండేది. ముఖ్యంగా చలికాలం విపరీతమైన దగ్గుతో బాధపడేది. దీంతో ఇటీవల డాక్టర్లను సంప్రదించిన ఆమెకు షాకింగ్ న్యూస్ తెలిసింది. ఆమె గొంతులో విజిల్ ఉన్న విషయం తెలిసింది. దీంతో డాక్టర్లు బ్రాంకోస్కోపీ చేసి ఆ విజిల్‌ను తొలగించారు.

Updated Date - 2021-02-18T18:23:32+05:30 IST