ఆ అరుదైన వింతజీవి ప్రపంచంలో మూడుసార్లు మాత్రమే కనిపించింది... బ్రిటన్, బ్రెజిల్... ఇప్పుడు భారత్‌లో...

ABN , First Publish Date - 2021-10-06T12:50:57+05:30 IST

ఆ అరుదైన పక్షి ఇప్పటివరకూ ప్రపంచంలో మూడుసార్లు మాత్రమే కనిపించింది.

ఆ అరుదైన వింతజీవి ప్రపంచంలో మూడుసార్లు మాత్రమే కనిపించింది... బ్రిటన్, బ్రెజిల్... ఇప్పుడు భారత్‌లో...

ఆ అరుదైన పక్షి ఇప్పటివరకూ ప్రపంచంలో మూడుసార్లు మాత్రమే కనిపించింది. ఇప్పుడు భారత్‌లో దర్శనమిచ్చింది. ల్యూసిస్టిక్ కామన్ కింగ్ ఫిషర్ పక్షి ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షిగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు మూడుసార్లు మాత్రమే మనుషులకు కనిపించిన ఈ పక్షి ఇప్పుడు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో తారసపడింది. దీనిని భాను ప్రతాప్ సింగ్, విధాన్ ద్వివేది అనే పక్షిశాస్త్ర నిపుణులు చూశారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ కింగ్ ఫిషర్ పక్షి దంగి గ్రామంలోని రెడ్ సెల్యూట్ ఫామ్‌లో కనిపించింది. దాని గూడును గ్రామంలోని ఒక చెరువుకు సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ పక్షి మొదటిసారిగా యునైటెడ్ కింగ్‌డమ్‌లో, రెండవసారి బ్రెజిల్‌లో కనిపించింది. 


భారతదేశంలో మూడవసారి కనిపించింది. భాను ప్రతాప్ సింగ్, విధాన ద్వివేది తాము ఈ అరుదైన పక్షిని ఆగస్టు 3 న తొలిసారి చూశామని తెలిపారు. అనంతరం వారు ఆ పక్షికి ఫోటోలు, వీడియోలు తీసి, ఈ కింగ్ ఫిషర్ పక్షికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం ప్రారంభించారు. దీనితో పాటు ఆ పక్షి గూడు కోసం  వెదుకులాట సాగించారు. మూడు,నాలుగు రోజులు వెతికిన తర్వాత ఆ పక్షిగూడును కనుగొన్నారు. ఈ అరుదైన పక్షికి సంబంధించిన వివరాల సేకరించిన వీరు మరికొందరి నిపుణుల సహాయంతో ఒక పరిశోధనా పత్రాన్ని సిద్ధం చేసి, ఈ వివరాలను ఇండియన్ బర్డ్ వెబ్‌సైట్‌కు పంపారు.


రాజపుతాన సొసైటీ ఆఫ్ నేచురల్ హిస్టరీ వ్యవస్థాపకుడు, ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ సత్యప్రకాష్ మెహ్రా దీని గురించి మాట్లాడుతూ ఉదయ్‌పూర్‌లోని ల్యూసిస్టిక్ కామన్ కింగ్‌ఫిషర్‌ను కనుగొన్న స్థలాన్ని... భారతదేశంలో ఆ పక్షి తొలిసారిగా ఆవాసం ఏర్పాటు చేసుకున్న ప్రాంతం అని పేర్కొన్నారు. ప్రస్తుత జీవవైవిధ్యం మధ్య ల్యూసిస్టిక్ కామన్ కింగ్ ఫిషర్ చూడటం అద్భుతమన్నారు. దీనికి తప్పనిసరిగా పరిశోధనలలో స్థానం దక్కాలన్నారు. కాగా ఉదయ్‌పూర్‌కు చెందిన పక్షి నిపుణుడు, రిటైర్డ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సతీష్ శర్మ లూసిస్టిక్ కామన్ కింగ్‌ఫిషర్‌ను చూసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కాలుష్య రహిత వాతావరణం కారణంగా అరుదైన జాతులకు చెందిన పక్షులు కూడా కనిపిస్తున్నాయని తెలిపారు.

Updated Date - 2021-10-06T12:50:57+05:30 IST