Americaలో ఆసక్తికర పరిణామం.. కమలా హారిస్‌కు అధ్యక్ష బాధ్యతలు

ABN , First Publish Date - 2021-11-20T13:08:26+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరోగ్య కారణాలరీత్యా తన బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు తాత్కాలికంగా బదిలీ చేయనున్నారు.

Americaలో ఆసక్తికర పరిణామం.. కమలా హారిస్‌కు అధ్యక్ష బాధ్యతలు

ఆరోగ్య కారణాల వల్ల కొద్దిసేపు బదిలీ చేసిన బైడెన్‌

వాషింగ్టన్‌, నవంబరు 19: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరోగ్య కారణాలరీత్యా తన బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు తాత్కాలికంగా బదిలీ చేశారు. వాషింగ్టన్‌లోని వాల్టర్‌ రీడ్‌ మెడికల్‌ సెంటర్‌లో శుక్రవారం ఆయన వైద్య పరీక్షలు చేయించుకునున్నారు. నవంబరు 20న బైడెన్‌ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకోనున్నారని, వైద్య పరీక్షల్లో భాగంగా ఆయనకు కొలనోస్కోపి (పెద్దపేగుకు సంబంధించిన) పరీక్ష చేస్తారని వైట్‌ హౌస్‌ ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10.10 నిమిషాల నుంచి 11.35 నిమిషాల వరకూ కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. కొనసాగింది కొంతసేపే అయినప్పటికీ అమెరికా దేశానికి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తొలి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.

Updated Date - 2021-11-20T13:08:26+05:30 IST