బైడెన్ పదవిలో ఉంటారా?.. తాజా ప్రవర్తనతో పెరుగుతున్న అనుమానాలు

ABN , First Publish Date - 2021-07-25T11:33:55+05:30 IST

గత నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జోబైడెన్.. తన నాలుగేళ్ల పదవీ కాలం పూర్తయ్యే దాకా అధ్యక్షుడి సీట్లో ఉంటారా? అంటే కష్టమనే సమాధానమే వినిపిస్తోంది కొందరి నుంచి. దీనికి ఆయన తాజాగా ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలే కారణం. కొంతకాలం క్రితం ఎయిర్ ఫోర్స్ వన్ విమానం...

బైడెన్ పదవిలో ఉంటారా?.. తాజా ప్రవర్తనతో పెరుగుతున్న అనుమానాలు

వాషింగ్టన్: గత నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జోబైడెన్.. తన నాలుగేళ్ల పదవీ కాలం పూర్తయ్యే దాకా అధ్యక్షుడి సీట్లో ఉంటారా? అంటే కష్టమనే సమాధానమే వినిపిస్తోంది కొందరి నుంచి. దీనికి ఆయన తాజాగా ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలే కారణం.  కొంతకాలం క్రితం ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కబోతూ మెట్లమీద ఆయన తూలిపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మూడు సార్లు లేచి నిలబడటానికి విఫల ప్రయత్నం చేసిన బైడెన్ చివరకు ఎలాగోలా విమానంలోకి వెళ్లారు. ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు తలాతోకా లేని సమాధానాలిచ్చి వార్తల్లో నిలిచారు. తన అనుయాయులు, ఉద్యోగుల పేర్లు మర్చిపోవడం కూడా బైడెన్‌కు అలవాటు. 


ఈ క్రమంలో తాజా ఇంటర్వ్యూ, అలాగే మరికొన్ని సంఘటనల్లో ఆయనేం చేస్తున్నారో ఆయనకే తెలియని పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే వైట్ హౌస్ మాజీ ఫిజీషియన్ రోనీ జాక్సన్ సంచలన ట్వీట్ చేశారు. ‘‘ఈ మనిషిలో ఏదో పెద్ద ఇబ్బంది ఉంది. నాకు తెలిసి ఆయన తన పదవీకాలం పూర్తిచేయరు. లేదా 25వ అధికరణం ద్వారా ఆయన చేత ప్రభుత్వమే రాజీనామా చేయించొచ్చు’’ అంటూ జాక్సన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అధ్యక్ష పదవిని చేపట్టే శారీరకంగా ఫిట్‌నెస్ బైడెన్‌కు లేదన్న ఆయన.. ట్రంప్‌ను కాగ్నిజిటివ్ టెస్ట్(ఆలోచనలు సక్రమంగా ఉన్నాయా? లేదా? అని చేసే పరీక్ష) చేయించుకోవాలని అడిగిన మేధావులు ఇప్పుడేం చేస్తున్నారని జాక్సన్ ప్రశ్నించారు. ‘బైడెన్ అధ్యక్ష పదవికి అన్‌ఫిట్’ అని తేల్చేసిన ఆయన.. అధ్యక్షుడి విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.

Updated Date - 2021-07-25T11:33:55+05:30 IST