నాలుక మీద తెల్లని పూత!

Mar 2 2021 @ 12:57PM

ఆంధ్రజ్యోతి(02-03-2021)

నాలుక మీద తెల్లని పూత ఏర్పడుతోందా? అయితే మీరు నాలుకను సరిగా శుభ్రం చేసుకోవడం లేదని అర్థం. నాలుక శుభ్ర చేయకపోవడం మూలంగా ఆ ప్రదేశంలో కెరటిన్‌ అనే చర్మపు ప్రొటీన్‌ పేరుకుని, ఈస్ట్‌, బ్యాక్టీరియాలకు నివాసంగా మారుతుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే, ఇతరత్రా నోటి సంబంధ సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి తెల్లని పూతను వదిలించాలి. ఇందుకోసం....


ఉప్పు: గ్లాసు నీళ్లలో రాతి ఉప్పు కలిపి, ఈ నీటితో నోరు పుక్కిలించాలి. ఇలా రోజులో ఆరు సార్లు చేయాలి. 


బేకింగ్‌ సోడా: సోడా ఉప్పులో నిమ్మరసం కలిపి, నాలుక మీద రుద్దుకోవాలి. 


నీళ్లు: వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లతో నాలుక మీద పేరుకునే ఆహారపదార్థాలు వదిలిపోతాయి.


పెరుగు: నాలుక మీద పేరుకునే చెడు బ్యాక్టీరియాను పెరుగులో ఉండే గుడ్‌ బ్యాక్టీరియా తరిమికొడుతుంది. కాబట్టి పెరుగు తినాలి. 


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.