ప్రభుత్వ కార్యక్రమాలపై శ్వేతపత్రం

ABN , First Publish Date - 2022-07-04T05:07:00+05:30 IST

నియోజకవర్గాల వారీగా ప్రభు త్వం నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనా రాయణ సూచించారు.

ప్రభుత్వ కార్యక్రమాలపై శ్వేతపత్రం
మాట్లాడుతున్న మంత్రి బొత్స

 జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్స

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: నియోజకవర్గాల వారీగా ప్రభు త్వం నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనా రాయణ సూచించారు. శ్రీకాకు ళం నగరంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో  నిర్వహించిన వైసీపీ జిల్లా ప్లీనరీలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మంత్రి బొత్స మాట్లాడుతూ.. 2024లోనూ సీఎంగా జగన్మోహన్‌రెడ్డే భారీ మెజార్టీతో ఎన్నికవు తారని చెప్పారు. విజయవాడలో  ఈ నెల 8, 9 తేదీల్లో  జరిగే రాష్ట్రస్థాయి ప్లీనరీకి కార్యకర్తలను, నాయకులను తీసుకువచ్చే బాధ్యత ఎమ్మెల్యేలే వహించాలని తెలిపారు. మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. వంట నూనె, ధాన్యం ధరలు కేంద్ర ప్రభు త్వం అదుపులో ఉన్నాయని, ఈ విషయం కార్యకర్తలే ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. రాష్ట్ర స్థాయి ప్లీనరీకి ఎవరికి వారే స్వయంగా ఏర్పాట్లు చేసుకొని వెళ్లాలని తెలిపారు. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. తన నియోజకవర్గ కార్యకర్తల కోసం విజయవాడకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేస్తానని, అన్ని ఖర్చులు తానే భరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్‌, రెడ్డిశాంతి, గొర్లె కిరణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, ఎంపీ చంద్రశేఖర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి, కార్యకర్తలు పాల్గొన్నారు. బ



Updated Date - 2022-07-04T05:07:00+05:30 IST